Ram Charan Peddi Updates: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘పెద్ది’ ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రధారిగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బుచ్చిబాబు.., ఇప్పుడు ‘పెద్ది’తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారనటంలో డౌట్ లేదు.
సరికొత్త అవతార్‌లో రామ్ చరణ్…
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. గతంలో ‘రంగస్థలం’ మూవీలో గోదావరి యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చరణ్.. ఇప్పుడు ఉత్తరాంధ్ర యాసతో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read – Balakrishna Honor: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. స్పందించిన సీఎం చంద్రబాబు
ఆఫర్ తిరస్కరించిన మలయాళ నటి…
బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్‌కు తల్లిగా నటించడానికి చిత్ర యూనిట్ ఒక మలయాళ నటిని సంప్రదించారు. అయితే ఆ పాత్రలో నటించటానికి ఆమె తిరస్కరించారు. ఆమె మరెవరో కాదు.. శ్వాసిక విజయ్. ఈ సమయంలో రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకు తల్లిగా నటించడం కరెక్ట్ కాదని ఆమె భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శ్వాసిక విజయ్ గురించిన వివరాల్లోకెళ్తే.. టీవీలో న్యూస్ ప్రెజెంటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తమిళ చిత్రాలతో పాటు అనేక మలయాళ సినిమాలలో నటించారు. కొన్ని సీరియల్స్‌లో సహాయక పాత్రలలో కూడా కనిపించారు. ‘వసంత’, ‘కుమారి’, ‘వివేకానందన్ విరలాను’ వంటి చిత్రాలలో ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చింది. తెలుగులో ఆమె నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు.
‘పెద్ది’పై భారీ అంచనాలు…
బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారు. విపరీతమైన అంచనాలతో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read – Sreeleela Dance Secret: ఎన్టీఆర్ ఇన్‌స్పిరేషన్‌తో శ్రీలీల.. ట్విస్ట్ రివీల్ చేసిన హీరోయిన్ తల్లి


