Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKalyani Priyadarshan: స్వీట్ వార్నింగ్

Kalyani Priyadarshan: స్వీట్ వార్నింగ్

Kalyani Priyadarshan: కథ బావుంటే ఎలాంటి సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠిస్తుందని, అందుకు పెద్ద స్టార్ కాస్టింగ్ గాని, పెద్ద దర్శకుడు గానీ అవసరం లేదని ఇటీవల వచ్చిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ నిరూపించింది. అంతకముందు వచ్చిన ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాలు ప్రూవ్ చేశాయి. క్రిష్ లాంటి పెద్ద దర్శకుడు, అనుష్క లాంటి లేడీ సూపర్ స్టార్ కలిసి చేసిన ‘ఘాటి’ మాత్రం కథ ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. ఇదే కాంబోలో వచ్చిన ‘వేదం’ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి ఓ క్రేజీ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.

- Advertisement -

గత కొంతకాలంగా సక్సెస్ లేని మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ కి ‘కొత్త లోక: చాప్టర్‌ 1 చంద్ర’ రూపంలో సాలీడ్ హిట్ దక్కింది. తండ్రి ప్రముఖ నిర్మాత ప్రియదర్శన్. ఆమె హిందీ, తమిళ సినిమాలకి ప్రొడక్షన్ డిజైనర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగులో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘చిత్రలహరి’, ‘రణరంగం’ సినిమాలు చేశారు. ఈ సినిమాలలో ఒకటి హిట్ గా.. మరోటి ఫ్లాప్‌గా మిగిలాయి. కళ్యాణి పర్ఫార్మెన్స్ కి అవార్డులతో పాటు ప్రశంసలు దక్కాయి. ఇక తమిళంలో శివ కార్తికేయన్ నటించిన ‘హీరో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

Also Read – RBI : రూ. 3,472 కోట్లు పలికిన 4.6 ఎకరాలు..ఎక్కడో తెలుసా..?

కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం కళ్యాణి ఇప్పటి వరకూ నిలదొక్కుకోలేకపోయారు. అయితే, గత నెలలో వచ్చిన ‘కొత్త లోక: చాప్టర్‌ 1 చంద్ర’ సినిమా మాత్రం పాన్ ఇండియా వైడ్‌గా ఈ నేచురల్ బ్యూటీకి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఏ ఒక్కరూ ఊహించని విధంగా కొత్త లోక రిలీజైన అన్నీ భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా మంచి వసూళ్ళు రాబడుతూ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో ఆయన “ఒక్కటి బాగా గుర్తు పెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు ఫ్లాప్ వస్తే ఆ బాధను మనసులో మోయకు, నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే.. లవ్యూ.. అని తన కూతురుకి మెసేజ్ పెట్టారు. దీనికి బదులుగా కళ్యాణి కూడా..” తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా”.. అని రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కొత్త లోక సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ వల్లే ఈ సినిమాకు ఓ రేంజ్‌లో కలెక్షన్స్‌ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్‌. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు’ అని రాసుకొచ్చారు. కాగా, దుల్కర్‌ సల్మాన్‌ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో నిర్మించాడు. ‘కొత్త లోక: చాప్టర్‌ 1 చంద్ర’ లో కల్యాణి ప్రియదర్శన్‌, నస్లీన్‌ ప్రధాన పాత్రలు పోషించగా, డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 28న మలయాళంలో.. ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 29న తెలుగులో విడుదలైంది.

Also Read – Sushmita konidela: భార్య అంటే చిరంజీవికి అంత భ‌య‌మా!.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సుస్మిత కొణిదెల‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad