Tamanna Vs Hero: తెలుగు సినీ ప్రపంచంలో మిల్కీ బ్యూటీగా పేరుకున్న తమన్నా భాటియా నటిగా తన ప్రయాణంలో ఎదుర్కొన్న కొన్ని మర్చిపోలేని ఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉన్న ఆమె, మొదటి దశలో తన కెరీర్ ఎలా సాగిందో గురించి ఓ సారి పాత జ్ఞాపకాలను పంచుకుంది.
చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా, అప్పుడు ఎదుర్కొన్న కష్టాల్ని చెప్పింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు తనకు పరిచయం, అనుభవం ఏమీ లేకపోవడం వల్ల కొందరికి తాను నటిగా కనిపించలేదని చెప్పింది. కొంతమంది తన నటనను గురించి చిన్న చూపు చూడటమే కాకుండా, నటిగా తన విశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారని చెప్పింది.
కోపంతో గట్టిగా..
ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే ఒక ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. ఆ సినిమాలో నటించే సమయంలో, కొన్ని సన్నివేశాల్లో తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పింది. వెంటనే ఆ విషయం గురించి దర్శకుడు, నిర్మాతలతో పంచుకున్నానని తెలిపింది. అయితే ఈ విషయం ఆ స్టార్ హీరోకి తెలియగానే, ఆయన సెట్లో పబ్లిక్‌గా కోపంతో గట్టిగా అరిచేశారని చెప్పుకొచ్చింది.
సెట్ నుంచే తీసేయమంటూ..
ఆహీరోయిన్ ని సెట్ నుంచే తీసేయమంటూ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చాడంట సదరు హీరో. అప్పుడు తనకు చాలా అవమానంగా అనిపించిందని చెప్పింది. కానీ మరుసటి రోజే ఆ హీరో తానే వచ్చి తనతో మాట్లాడాడని, జరిగినదానికి క్షమాపణలు కూడా కోరాడని తమన్నా వెల్లడించింది.
తనపై అరిచినందుకు బాధపడి, నచ్చజెప్పే స్థాయిలో మాటలాడిన ఆ హీరో, తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నట్టుగా తెలిపింది.
ఈ సంఘటన వల్ల తనకు ఓ ముఖ్యమైన బోధ పాఠం కూడా నేర్చుకున్నట్టు చెప్పింది తమన్నా. సెలెబ్రిటీలుగా ఎదగాలంటే, మొదట్లోనే తమ స్థానం కోసం పోరాడాల్సి వస్తుందని, ఎవ్వరైనా సరే న్యాయం కోసం నిలబడితే తగిన గౌరవాన్ని పొందవచ్చని వివరించింది.


