Sunday, November 24, 2024
Homeచిత్ర ప్రభTamannaah: చాలా పెళ్లిళ్లు అయ్యాయిగా.. పెళ్లిపై తమన్నా కామెంట్స్

Tamannaah: చాలా పెళ్లిళ్లు అయ్యాయిగా.. పెళ్లిపై తమన్నా కామెంట్స్

- Advertisement -

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా సినీ పరిశ్రమకి వచ్చి 17 ఏళ్ళు అయిపోయింది. అయినా ఇప్పటికీ స్టార్ హీరోలతో జత కడుతూ వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్, హిందీలో తమన్నాకి వరుస ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం సత్యదేవ్ సరసన నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయం గురించి షేర్ చేసుకుంది తమన్నా.

తమన్నా తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. ”నేను పెళ్లి చేసుకోకపోయినా మీడియా వాళ్ళు, వెబ్ సైట్స్ వాళ్ళు ఇప్ప్పటికే నా పెళ్లి చాలా సార్లు చేసేశారు. ఒకసారి డాక్టర్ తో, ఇంకోసారి వ్యాపారవేత్తతో పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు రాసేశారు. అందరి అమ్మాయిలకి ఉండేలాగే నాకు కూడా పెళ్లి చేసుకోమని ప్రెజర్ ఉంది. మా ఇంట్లో కూడా నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను. అప్పుడు మీ అందరికి చెప్పే చేసుకుంటాను. అది లైఫ్ లాంగ్ ఉండాల్సిన విషయం కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని తెలిపింది. మరి తమన్నా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News