Tamannaah Bhatia: సీనియర్ హీరోయిన్స్‌లో ఇప్పటికీ క్రేజ్ తగ్గనిది అంటే తమన్నాకే. శ్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నా, ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకూ సినిమాల పరంగా తమన్నా.. వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన రచ్చ గ్లామర్ పరంగా తమన్నాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల సరసన నటించడం విశేషం.
ఇలా మూడు జనరేషన్స్ ని రౌండప్ చేసిన తమన్నా, తమిళంలో కూడా స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఒకానొక సమయంలో అటు తమిళం ఇటు తెలుగు సినిమాలలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరోయిన్‌గా తమన్నా హాట్ టాపిక్ అయింది. హీరోయిన్స్ అందరూ డాన్స్ విషయంలో అంత పర్ఫెక్ట్ కాదు. కానీ, బెల్లీ డాన్స్ కి ఇలియానా తర్వాత తమన్నానే ఫేమస్. ఎన్టీఆర్, రామ్, రామ్ చరణ్ లాంటి డాన్సర్స్ కి తమన్నా గట్టి పోటీ ఇచ్చింది. తమన్నాలో మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కథ నచ్చితే అది చిన్న సినిమా అయినా నటించడానికి ఒప్పుకున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా, దర్శకుడు సంపత్ నందితో మంచి బాండింగ్ ఉంది.
Also Read – Narayana: ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
చాలామంది హీరోయిన్స్ మేయిన్ లీడ్ చేస్తున్న సమయంలో ఐటం సాంగ్ చేయడానికి ఎంతమాత్రం ఒప్పుకోరు. ఎక్కడ హీరోయిన్‌గా క్రేజ్ తగ్గి.. పక్కన పెట్టేస్తారోననే భయం ఉంటుంది. కానీ, తమన్నా దీనికి పూర్తిగా భిన్నం. తన సాంగ్ సినిమాకి ప్లస్ అవుతుందనుకుంటే.. రెమ్యునరేషన్ సెకండరీ.. మూడు రోజులు కావాలా.. నాలుగు రోజులు కావాలా.? అని ఆ స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ సర్దుబాటు చేస్తుంది. ఈ మధ్య కాలంలో స్పెషల్ నంబర్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న హీరోయిన్ తమన్నా భాటియా మాత్రమే. దీని గురించి ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.
తమన్నా ఐటం సాంగ్స్ చూస్తూ చిన్నపిల్లలు డిన్నర్ చేస్తున్నారట. ఇది తన దృష్టికి వచ్చిందని.. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.. ఇలాంటి గొప్ప అవకాశం ఎంతమంది హీరోయిన్స్ కి వస్తుందీ.. అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఇప్పటికే తమన్నా, మహేశ్ బాబు, రజినీకాంత్, బెల్లంకొండ శ్రీనివాస్, అలాగే.. హీందీలోనూ కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి ఫుల్ ట్రెండింగ్ లో నిలిచింది. మొత్తానికి తమన్నా లాజిక్ మిగతా హీరోయిన్స్ మాత్రం పట్టుకోలేదనే చెప్పాలి. ఇక సినిమాలు, స్పెషల్ నంబర్స్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా తమన్నా తన హాట్ పర్ఫార్మెన్స్‌తో హీటెక్కిస్తోంది.
Also Read – NTR War 2: ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు!!


