Ragini MMS 3 Update: హీరోయిన్‌గానే చేయాలి.. గ్లామర్ పాత్రల్లోనే మెప్పించాలి.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతోనే అలరించాలనే నిబంధనలు పెట్టుకోకుండా మారుతున్న ట్రెండ్ ఫాలో అవుతూ తన క్రేజ్‌ను కాపాడుకుంటున్న బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia). సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది మిల్కీబ్యూటీ. ఇప్పుడు మరో సంచలనాత్మక ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టబోతుందనే వార్త టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హల్‌చల్ చేస్తోంది.
బాలీవుడ్‌లో ‘రాగిణి MMS’కు ఉండే క్రేజే వేరు. ఈ సినిమా రెండు ఫ్రాంచేజీలకు యూత్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం సన్నీలియోన్ వాటిలో అందాల విందుచేయటమే. త్వరలోనే మూడో భాగం కూడా తెరకెక్కనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూడో పార్ట్‌లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుందంటూ బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత ఏక్తా కపూర్‌తో తమన్నా చర్చలు జరిపిందని.. ఇద్దరూ ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో వచ్చిన ‘రాగిణి MMS 2’లో సన్నీ లియోన్ (Sunny Leone) పోషించిన బోల్డ్ రోల్ ప్రేక్షకులకు ఇంకా గుర్తుండిపోయింది. సన్నీలియోన్ తన గ్లామరస్, బోల్డ్ ప్రజెన్స్‌తో ఆ సినిమాలో అదరగొట్టింది. అంతే కాకుండా కమర్షియల్‌గానూ సక్సెసై బాలీవుడ్‌లో మంచి బ్రేక్ సంపాదించుకుంది. ఇప్పుడు తమన్నా కూడా తన కంఫర్ట్ జోన్‌లను బ్రేక్ చేసి, అలాంటి బోల్డ్ రోల్‌కి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాగిణి MMS 3’లో తమన్నా సన్నీలియోన్‌ని మరిపిస్తుందా లేదా తేలిపోతుందా అని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
Also Read – Actor Naresh New Home : 5 ఎకరాల్లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టిన నరేష్.. వీడియో వైరల్
వాస్తవానికి తమన్నా కెరీర్‌లో ఇటీవలి కాలంలో పెద్ద మార్పు వచ్చింది. చాలా కాలం పాటు ‘నో కిస్ పాలసీ’ని పాటించిన తమన్నా, తనకు అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని భావించి ఆ పాలసీని పక్కన పెట్టింది. రీసెంట్ టైమ్‌లో తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్, అల్ట్రా గ్లామరస్ పాత్రలతో రెచ్చిపోతోంది. ‘జైలర్’ చిత్రంలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్, అలాగే ‘లస్ట్ స్టోరీస్ 2’లో ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ‘స్త్రీ 2’లో ఆమె చేసిన ‘ఆజ్ కీ రాత్’ ఐటమ్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ విధంగా ఘాటు అందాలతో అలరిస్తోన్న తమన్నా, ‘రాగిణి MMS 3’ ద్వారా తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
మారుతున్న ట్రెండ్‌లో భాగంగానే తమన్నా ఈ బోల్డ్ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సన్నీలియోన్ తర్వాత, ‘రాగిణి MMS’ ఫ్రాంచైజీకి తమన్నా వంటి స్టార్ హీరోయిన్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ డీల్ త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.
Also Read – Immigration Policy: ట్రంప్ కఠిన వైఖరి.. 1960 తర్వాత భారీగా తగ్గిన వలసలు


