టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తనదైన హావభావాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘శ్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా, ‘హ్యాపీడేస్’ వంటి హిట్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా దక్షిణాది చిత్రరంగంలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్గా ఎదిగింది. మలయాళం సినిమాల్లోనూ మెరిసిన ఆమె, ఐటమ్ సాంగ్స్‌లోనూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. గత ఏడాది నాలుగు సినిమాలతో మంచి హిట్ ట్రాక్ కొనసాగించిన తమన్నా, ఇటీవల ‘ఓదెల-2’ చిత్రంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే, నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉందన్న వార్తలు బాగా వినిపించాయి. అప్పుడప్పుడూ వీరిద్దరూ కలిసి వేకేషన్ ట్రిప్స్‌కి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు, బ్రేకప్ అయిపోయారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒకే చోట కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు ఈ జంట వార్తల్లో లేదు కానీ, తమన్నా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఓ వీడియో. అందులో తమన్నా సరిగ్గా లేనట్లుగా, బొద్దుగా కనిపించడంతో ఇది నిజంగా ఆమెదేనా? లేక ఏఐ సహాయంతో తయారుచేసిన వీడియోనా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇందులో ఆమె ఫిజికల్ అపీరియన్స్ మామూలుగా ఉండకపోవడంతో.. కొంతమంది నెటిజన్లు తమన్నా గర్భవతిగా ఉందా.. అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరికొందరు అయితే ఇదేం లుక్ రా నాయనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
https://www.instagram.com/reel/DKFXLqXhes1/?utm_source=ig_web_copy_link
ఈ వీడియో నిజంగా తమన్నాదేనా లేదా అనే విషయంపై ఇప్పటివరకు తమన్నా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం ఇది కచ్చితంగా ఫేక్ కావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.