Tamannaah: తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లెవెన్త్ అవర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2021లో రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. తాజాగా లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో కూడిన ఈ వెబ్ సిరీస్‌ను రెండు గంటల రన్‌టైమ్‌తో ట్రిమ్ చేసి సినిమాగా ఆహా ఓటీటీ విడుదల చేస్తోంది. లెవన్త్ అవర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. తమన్నా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తెలుగులో ఫస్ట్ అండ్ లాస్ట్…
లెవెన్త్ అవర్ సిరీస్‌లో తమన్నాతో పాటు అరుణ్ అదిత్, వంశీకృష్ణ, పవిత్రా లోకేష్, శత్రు కీలక పాత్రల్లో నటించారు. ఉపేంద్ర నంబూరి రాసిన 8 అవర్స్ బుక్ ఆధారంగా ఈ సిరీస్‌ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్‌తోనే తమన్నా తెలుగు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఆమె చివరి తెలుగు వెబ్ సిరీస్ కూడా కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో తమన్నా నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కాన్సెప్ట్ స్లోగా సాగడం, ఓవర్ మెలోడ్రామా సిరీస్‌కు మైనస్‌గా మారింది.
Also Read- Mahesh Babu: ఇప్పటివరకు రీమేక్, సీక్వెల్ సినిమాలు చేయని ఒకే ఒక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
లెవెన్త్ అవర్ కథ ఇదే…
లెవెన్త్ అవర్ కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. అరత్రికా రెడ్డి (తమన్నా) ఓ మల్టీనేషనల్ కంపెనీకి సీఈవోగా పనిచేస్తుంటుంది. ఆమెకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ వర్గాలు కుట్రలు పన్నుతాయి. ఒక్క నైట్ ఎనిమిది గంటల్లో తొమ్మిది వేల కోట్లు కడితేనే తన కంపెనీని కాపాడుకునే పరిస్థితి అరిత్రికా రెడ్డికి వస్తుంది. ఈ సమస్య నుంచి అరత్రికా రెడ్డి ఎలా బయటపడింది అన్నదే లెవెన్త్ అవర్ కథ.
ఓదెల 2 డిజాస్టర్…
ఈ ఏడాది ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది తమన్నా. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ మూవీలో నాగసాధువుగా తమన్నా కనిపించింది. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు చేస్తోంది తమన్నా. డేరింగ్ పార్ట్‌నర్స్ పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
Also Read- Bigg Boss Telugu : బిగ్ బాస్ ఇంట్లో తొలి తెలుగు డ్రాగ్ క్వీన్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం!


