Tamannaah Bhatia: కొత్త హీరోయిన్ల జోరుతో తమన్నా హవా తగ్గింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టినా స్పెషల్ సాంగ్స్ విషయంలో మాత్రం మిల్కీ బ్యూటీకి మంచి డిమాండ్ ఉంది. తమన్నా చేసిన జైలర్‌లోని కావాలయ్యా, స్త్రీ2 సినిమాలోని ఆజ్ కీ రాత్ పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఈ స్పెషల్ సాంగ్స్ కోసం తమన్నా రెండు కోట్లకుపైనే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు గిట్టుబాటు కావడంతో మరిన్ని స్పెషల్ సాంగ్స్‌లో చేయడానికి తమన్నా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ రాజా సాబ్‌లో తమన్నా ఐటెంసాంగ్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిలాసాఫికల్ పోస్ట్…
నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణానికి ఇటీవలే బ్రేకులు పడ్డాయి. మనస్పర్థలతో ప్రియుడికి బ్రేకప్ చెప్పింది తమన్నా. ఈ విఫల ప్రేమ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫిలాసాఫికల్ పోస్ట్ పెట్టింది తమన్నా. బ్రేకప్ గురించి తమన్నా ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చెబుతోన్నారు. జీవితంలో ప్రతి తప్పు ఓ అనుభవ పాఠాన్ని నేర్పుతుందని ఈ పోస్ట్‌లో తమన్నా పేర్కొన్నది. “జీవితాన్వేషపు దశలో మనం వేసే ప్రతి అడుగు విలువైనదే. ప్రతి విషయం ముఖ్యమే. ఇక్కడ మన ప్రణాళికలు మొత్తం స్టికీ నోట్స్ రూపంలో జీవించే ఉంటాయి. కానీ ఏది పరిపూర్ణం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.. అంతకుమించిన అనుమానాలు వెంటాడుతూనే ఉంటాయి. నిజాయితీగా ఉండటం ముఖ్యం. ప్రతి మెరిసే వస్తువు వెనుక ప్రకాశవంతం కానీ ఓ పెద్ద కార్యమే ఉంటుంది..” అంటూ తన పోస్ట్‌లో తమన్నా పేర్కొన్నది. తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read – Rashmika Mandanna Business: కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నేషనల్ క్రష్ – సపోర్ట్ కావాలంటూ పోస్ట్
జ్యూవెల్లరీ బిజినెస్…
ఈ పోస్ట్‌తో పాటు కొన్ని వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది తమన్నా. ఓ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్‌లో ఎంటరైన తమన్నా తన టీమ్‌కు కొన్ని సూచనలు ఇస్తూ కనిపించింది. వారితో మీటింగ్ నిర్వహిస్తున్న ఫొటోలను పంచుకున్నది. హీరోయిన్‌గా నటిస్తూనే వైటెన్ గోల్డ్ పేరుతో ఓ జ్యూవెల్లరీ బిజినెస్‌ను చాలా కాలంగా రన్ చేస్తోంది తమన్నా. తన బిజినెస్‌కు సంబంధించిన కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ పనులతో తమన్నా బిజీగా ఉన్నట్లు ఈ వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది.
బ్రేకప్ బాధ…
విజయ్ వర్మతో డేటింగ్ తన జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయంగా తమన్నా భావిస్తోన్నట్లు సమాచారం. బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు జ్యూవెల్లరీ బిజినెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నట్లు సమాచారం. మరోవైపు చిన్న సినిమాలతో అవకాశం వస్తే వెబ్‌సిరీస్‌లలో నటించడానికి తమన్నా సిద్ధంగా ఉన్నట్లు చెబుతోన్నారు.
Also Read – HHVM Pre Release Business: ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా!
మూడు సినిమాలు…
ప్రస్తుతం తమన్నా హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం తమన్నా చేతిలో ఒక్క సినిమా లేదు. ఈ ఏడాది తెలుగులో తమన్నా చేసిన ఓదెల 2 డిజాస్టర్‌గా నిలిచింది. సంపత్‌నంది కథను అందించిన ఈ మూవీలో నాగసాధువు పాత్రలో తమన్నా నటించింది.


