Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభTamannaah: స్లిమ్‌గా క‌నిపించ‌టానికి ఇంజెక్ష‌న్స్‌.. త‌మ‌న్నా రియాక్ష‌న్‌

Tamannaah: స్లిమ్‌గా క‌నిపించ‌టానికి ఇంజెక్ష‌న్స్‌.. త‌మ‌న్నా రియాక్ష‌న్‌

Tamannaah: సినిమా అంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్‌. హీరోయిన్లు సినిమా ఇండ‌స్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఒక్క‌టే స‌రిపోదు గ్లామ‌ర్ ముఖ్య‌మే. అందాల ముద్దుగుమ్మ‌ల చుట్టే ఇండ‌స్ట్రీ తిరుగుతుంది. గ్లామ‌ర్‌ను మెయింటేన్ చేయ‌డానికి హీరోయిన్లు చాలానే క‌ష్ట‌ప‌డుతుంటారు. స్లిమ్ లుక్ కోసం జిమ్‌లో వ‌ర్క‌వుట్ల పేరుతో చెమ‌ట‌లు చిందిస్తుంటారు. ముద్దుగుమ్మ‌లు బొద్దుగా మారితే విమ‌ర్శ‌లు మాత్ర‌మేఅవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మే అవుతుంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అదే ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మ‌ధ్య త‌మ‌న్నా బొద్దుగా క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌మ‌న్నా లుక్‌పై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి.

- Advertisement -

మునుప‌టి ఛార్మ్ కోసం త‌మ‌న్నా ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌. బ‌రువు త‌గ్గేందుకు ఒజెంపిక్ లాంటి ఇంజెక్ష‌న్లు వాడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్స్‌పై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా రియాక్ట్ అయ్యింది. బ‌రువు త‌గ్గ‌డం కోసం ఇంజెక్ష‌న్లు వాడుతున్నానంటూ వ‌స్తోన్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని అన్న‌ది. “కెరీర్ ఆరంభంలో నా లుక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నా. టీనేజ్ నుంచి ఇదే స్లిమ్ లుక్‌ను మెయింటేన్ చేస్తున్నా. ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే నా యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. కెమెరాతోనే నా ప్ర‌యాణం సాగుతోంది. నా గురించి దాచ‌డానికి ఏం లేదు. నేనేంటో అంద‌రికి తెలుసు. ఆ లైఫ్ మొత్తం తెరిచిన పుస్త‌కం లాంటిదే” అని చెప్పింది.

Also Read – Sreeleela: డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మ‌రో ఛాన్స్ – కోలీవుడ్‌లో బిజీ అవుతున్న శ్రీలీల‌

“అంతే కాకుండా నా లుక్ విష‌యంలో ఎలాంటి మార్పులు లేవ‌నుకుంటున్నా. నాకు నేను కొత్త‌గా క‌నిపించ‌డం లేదు. మార్పు అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి లైఫ్‌లో కామ‌న్‌. ప్ర‌తి ఐదారేళ్ల‌కు మ‌హిళ‌ల శ‌రీరాకృతిలో మార్పులు వ‌స్తాయి. ఎప్పుడు ఒకేలా క‌నిపించ‌డం ఎవ‌రికి సాధ్యం కాదు” అని త‌మ‌న్నా అన్న‌ది. మిల్కీ బ్యూటీ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

కొత్త హీరోయిన్ల దూకుడుతో త‌మ‌న్నాకు అవ‌కాశాలు త‌గ్గాయి. హీరోయిన్‌గా ఛాన్స్‌లు అంత‌గా రావ‌డం లేదు. దాంతో స్పెష‌ల్ సాంగ్స్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోంది. ఈ ఏడాది తెలుగులో ఓదెల 2 సినిమా చేసింది. మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఓదెల 2 త‌ర్వాత తెలుగులో కొత్త సినిమా ఏదీ అంగీక‌రించ‌లేదు త‌మ‌న్నా. బాలీవుడ్‌లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. త‌మిళంలో విశాల్‌, సుంద‌ర్ సి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న కొత్త సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Also Read – Delhi blast effect: కోల్‌కతాలో హై అలర్ట్.. భారత్-సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రత పెంపు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad