Tamannaah: మన శంకర వరప్రసాద్‌గారుతో తమన్నా స్పెషల్ నంబర్ ఉండబోతుందట. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న మన శంకర వరప్రసాద్‌గారు 2026, సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వరుస షెడ్యూల్స్‌తో సినిమా చిత్రీకరణను చివరి దశకి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో చిరుకి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా, వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు. ఇటీవల మొదలైన షెడ్యూల్‌లో చిరు-వెంకీలపై సీన్స్‌ని షూట్ చేసినట్టుగా సమాచారం. అలాగే, వీరిపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ స్పెషల్ నంబర్‌లో చిరు-వెంకీలతో ఆడిపాడేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంచుకున్నట్టుగా తాజా సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలలో తమన్నా ఓ హీరోయిన్‌గా అలరించిన విషయం తెలిసిందే. అలాగే మహేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లోనూ తమన్నాకు అవకాశం లభించింది. అప్పటి నుంచి అనిల్ రావిపూడితో తమన్నాకి మంచి బాండింగ్ ఉంది. దీంతో మన శంకర వరప్రసాద్‌గారు మూవీలో ఉన్న స్పెషల్ నంబర్ కోసం తమన్నాని సెలెక్ట్ చేశారట.
చిరంజీవి నటించిన సైరా మూవీలో తమన్నా కీలక పాత్రను పోషించింది. చరణ్, పవన్ కళ్యాణ్‌లతోనూ ఈ మిల్కీ బ్యూటీ ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇక స్పెషల్ నంబర్ అంటే ఇప్పుడు తమన్నాకి ఉన్న క్రేజ్ మరో హీరోయిన్‌కి లేదనే చెప్పాలి. అందుకే, ఇద్దరు అగ్ర హీరోలు కలిసి తెరమీదే చేసే సందడిలో తమన్నాని భాగం చేయనున్నారట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా మేకర్స్ నుంచి రానున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
Also Read: Madonna Sebastian: బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న ప్రేమమ్ బ్యూటీ


