Tamannaah: షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌తో డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ వెబ్‌సిరీస్ పట్ల బాలీవుడ్ వర్గాలతో పాటు ఆడియెన్స్‌లో ఆసక్తి మొదలైంది. స్టార్ హీరో సినిమాల లెవెల్‌లో ఈ సిరీస్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఈ వెబ్‌సిరీస్‌లో షారుఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్‌తో పాటు బాలీవుడ్‌లోని అగ్ర హీరోలంతా గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో కిల్ ఫేమ్ లక్ష్య లల్వానీ, బాబీడియోల్, అన్య సింగ్, మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు.
అంబానీ ఫ్యామిలీ…
గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది. అంతకుముందు రోజు ముంబైలో జరిగిన ఈ వెబ్‌సిరీస్ ప్రీమియర్‌కు బాలీవుడ్ సెలిబ్రిటీలందరూ అటెండ్ అయ్యారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
కాగా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. గఫూర్ అంటూ సాగిన ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో తన స్టెప్పులతో పాటు గ్లామర్‌తో తమన్నా అదరగొట్టడం ఖాయమని అనుకున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు తమన్నా సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు.
Also Read – Diapers: డైపర్ వేసే అలవాటు.. శిశువుకు మంచిదా..? చెడ్డదా..?
ఎడిటింగ్ కట్…
కానీ గురువారం రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా సాంగ్ మాత్రం కనిపించలేదు. కనీసం స్టార్టింగ్ తో పాటు ఎండ్ టైటిల్ కార్డ్స్ పడే టైమ్‌లోనైనా ఈ పాటను స్క్రీనింగ్ చేయలేదు. ఈ వెబ్‌సిరీస్ నుంచి తమన్నా సాంగ్‌ను కట్ చేయడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. కథకు సంబంధం లేకుండా ఉందనే ఆలోచనతో చివరి నిమిషంలో ఎడిటింగ్‌లో తమన్నా సాంగ్‌ను మేకర్స్ లేపేసినట్లు ప్రచారం జరుగుతోంది.
బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో తమన్నా సాంగ్ ఉంచాల్సిందని నెటిజన్లు చెబుతున్నారు. వెబ్‌సిరీస్‌లో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, వాటిని కట్ చేసే తమన్నా సాంగ్ పెడితే బాగుంటుందని అంటున్నారు. వెబ్‌సిరీస్‌లో పెట్టకపోయినా కనీసం యూట్యూబ్‌లోనైనా రిలీజ్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు.
తమన్నా సాంగ్‌పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. కాగా ఈ పాట కోసం తమన్నాకు భారీగానే రెమ్యూనరేషన్ అందినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు కోట్లకుపైనే తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాగా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్‌సిరీస్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కంటెంట్ మాత్రం ఔట్‌డేటెడ్ అని అంటున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను షారుఖ్‌ఖాన్ స్వయంగా నిర్మించారు.
Also Read – Robo Shankar Passed away : కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత


