The Rajasaab: హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కున మెరుస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్యకాలంలో తమన్నా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. జైలర్‌లో కావాలయ్యా, స్త్రీ 2 మూవీలోని ఆజ్ కీ రాత్ సాంగ్స్ సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.
ప్రభాస్ మూవీలో..
తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ సారి రెబల్‌స్టార్ ప్రభాస్‌తో స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ఐటెంసాంగ్ కోసం భారీ ఖర్చుతో మేకర్స్ ఓ స్పెషల్ సెట్‌ను సిద్ధం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజాసాబ్ మూవీకి ఈ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గతంలో రెబెల్, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించింది తమన్నా. ఇప్పుడు అతని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Also Read – Chhattisgarh: హాయిగా బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపు.. వైరల్ గా మారిన వీడియో..
హారర్ కామెడీ…
రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. సూపర్ నాచురల్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సింది…
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజాసాబ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదాపడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాజాసాబ్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. రాజాసాబ్ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.
Also Read – Jobs: ఈసీఐఎల్‌లో ఖాళీల భర్తీ.. రేపే లాస్ట్ డేట్
రాజాసాబ్‌తో పాటు హనురాఘవపూడి ఫౌజీలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సివుంది. ఇటీవల రిలీజైన మంచు విష్ణు కన్నప్పలో ఓ గెస్ట్‌లో ప్రభాస్ కనిపించాడు.


