Tamil Actor Arrest: తమిళ నటుడు ఎస్. శ్రీనివాసన్ ను ఒక భారీ మోసం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఢిల్లీలోని ఓ ప్రముఖ సంస్థను రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించి రూ.5 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లడి కావడంతో, ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
వెయ్యి కోట్లు వచ్చేలా..
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, 2010లో ఢిల్లీలోని ఓ సంస్థకు చెందిన ప్రతినిధులతో శ్రీనివాసన్ సంప్రదించి, వారి వ్యాపార అవసరాల కోసం పెద్ద మొత్తంలో రుణాన్ని సమకూర్చుతానని చెప్పారు. అంతేకాదు, నెల రోజుల వ్యవధిలోనే మొత్తం వెయ్యి కోట్లు వచ్చేలా చేయగలమని భరోసా ఇచ్చారు. అయితే రుణం ప్రాసెస్ చేయడానికి ముందుగా ఖర్చుల పేరుతో రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా కావాలని కోరారు.
సినిమాల నిర్మాణానికి..
సంబంధిత సంస్థ ప్రతినిధులు శ్రీనివాసన్ చెప్పిన మాటలు నమ్మి అతడికి అడ్వాన్స్‌గా రూ.5 కోట్లు చెల్లించారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఒక నెలలో రుణం వచ్చి తీరాలి. కానీ నెలలు గడుస్తున్న ఒక్క రూపాయి రుణం కూడా అందలేదు.ఇది గమనించిన సంస్థ ప్రతినిధులు శ్రీనివాసన్‌ను సంప్రదించగా ఆయన మరోమారు సమయం అడుగుతూ జాప్యం చేస్తూ వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. చివరికి అనుమానంతో ఉన్న సంస్థ విచారణ చేపట్టగా, శ్రీనివాసన్ అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బు తన వ్యక్తిగత ఖర్చులకు, అలాగే కొన్ని సినిమాల నిర్మాణానికి ఉపయోగించుకున్నాడన్న విషయం బయటపడింది.
మోసపోయిన సంస్థ..
ఈ క్రమంలో మోసపోయిన సంస్థ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసును దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసన్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడన్న సమాచారం మేరకు, బుధవారం పోలీసులు చెన్నైకి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు.శ్రీనివాసన్ సినీ నేపథ్యం పరిశీలిస్తే, 2010లో కోలీవుడ్‌లోకి ప్రవేశించి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా 2011లో వచ్చిన ‘లతిక’ అనే చిత్రంలో ఆయన హీరోగా నటించారు. అదేవిధంగా నిర్మాతగా కూడా కొన్ని సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో నటించడమే కాదు, చెన్నైలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను కూడా ప్రారంభించారు.
ఆ సంస్థ పేరుతోనే ఈ భారీ మోసానికి శ్రీనివాసన్ పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారులకు పెద్ద మొత్తంలో రుణం ఇప్పిస్తానని చెబుతూ ముందస్తు డబ్బులు వసూలు చేయడమే అతడి ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తున్నట్లు విచారణలో తేలింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/samantha-and-raj-nidimoru-spark-fresh-dating-rumors-again/
శ్రీనివాసన్ తన వ్యక్తిగత బ్రాండ్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నించేవాడు. తమిళనాడులో అతను స్వయంగా తనను తాను ‘పవర్ స్టార్’ అంటూ చెప్పుకోవడం ఇది వరకు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల్లో ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి పేర్లను వాడటం ద్వారా చర్చలకెక్కిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు.
ఇటీవల వరకు అతను సినిమాల్లో కన్పిస్తూ వచ్చినా, ఫైనాన్స్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నట్లు చూపించేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ మోసం కేసు వెలుగులోకి రావడంతో అతడి వ్యక్తిగత బ్రాండ్‌పై నమ్మకం కోల్పోయినట్టు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మోసపూరితంగా డబ్బులు..
పోలీసులు ప్రస్తుతం శ్రీనివాసన్‌ను అదుపులోకి తీసుకుని మోసం జరిగిన తీరును విచారిస్తున్నారు. అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బును ఏ విధంగా ఖర్చు చేశాడు, ఇంకా ఎవెవరి నుంచి ఇలాంటి మోసపూరితంగా డబ్బులు తీసుకున్నాడన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో మరికొంతమంది వ్యక్తులు లేదా మధ్యవర్తులు పాల్గొన్నారో లేదో అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, బాధిత సంస్థ ప్రతినిధులు తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ, న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి న్యాయ సహాయమూ లేకుండా అతడి చేతిలో మోసపోయామని వారు పేర్కొంటున్నారు.
ఈ సంఘటన సినీ పరిశ్రమలోనూ, వ్యాపార రంగాల్లోనూ కలకలం రేపింది. సినీ నటులు లేదా ఇతర ప్రముఖులు తమ ప్రాచుర్యాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వాడుకోవడం ద్వారా ఎలా నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారో మరోసారి స్పష్టమైంది.


