Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభVishal: హీరో విశాల్‌ ప్రాబ్లమ్ ఇదే.. హెల్త్ బులిటెన్ విడుదల

Vishal: హీరో విశాల్‌ ప్రాబ్లమ్ ఇదే.. హెల్త్ బులిటెన్ విడుదల

కోలీవుడ్ హీరో విశాల్‌(Vishal) ఆరోగ్యం బాలేదంటూ ఆదివారం సాయంత్రం నుంచి వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ‘మదగజరాజ’ ప్రెస్‌మీట్‌లో ఆయన బాగా తగ్గిపోయి వణుకుతూ కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దీంతో అసలు విశాల్‌కు ఏమైంది? అని కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేలా అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని రిపోర్ట్‌లో తెలిపారు. దీంతో విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

- Advertisement -

విశాల్ నంటించిన ‘మదగజరాజ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన సినిమా ఈవెంట్ సందర్భంగా వేదికపై వచ్చిన విశాల్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. అతడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. బాగా తగ్గిపోయారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలా మంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించారు. దీంతో తమ అభిమాన హీరోకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News