తమిళ హీరో విశాల్ గురించి.. తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన నంటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగై మంచి విజయాలు సాధించాయి. అయితే తాజాగా హీరో విశాల్ నంటించిన మదగజరాజ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా వేదికపై వచ్చిన విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు.
ఎందుకంటే ఆయన విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించారు. విశాల్ హై ఫీవర్, జలుబుతో బాధపడుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా విశాల్ నటించిన సినిమాల పై ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగులోనూ విశాల్ కు మంచి మార్కెట్ ఉంది. ఇక మదగజరాజు సినిమా విషయానికి వస్తే ఇది దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నటుడు సుందర్ సి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాను 2013లో విడుదల చేయాలి. కానీ అప్పుడు విడుదల ఆగిపోయింది. విశాల్ నటించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కలిసి నటించారు.
కామిడీ యాక్షన్ కథాంశంతో రూపొందించి ఈ మూవీ.. 2013 సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా.. అప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల కాలేదు. ఈ సందర్భంలో, సుమారు 12 సంవత్సరాల తరువాత, ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని పొంగల్ కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.