Tammareddy Bharadwaja: టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చించేశాను… పొడిచేశాను అంటూ ఛాలెంజ్‌లు చేయడం, చెప్పులతో కొట్టుకోవడం వల్ల ప్రేక్షకులు సినిమాలు చూడరని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స ఇటీవల తన సినిమాకు టాక్ బాగున్నా ఎవరూ చూడటం లేదంటూ ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం కొంత మంది హీరోహీరోయిన్లు నటించిన సినిమాలు మాత్రమే చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. వారి సినిమాలకే టికెట్లు తెగుతున్నాయని చెప్పారు.
Also Read – TTV Dinakaran : తమిళనాడులో రాజకీయ చిచ్చు.. ఎన్డీఏ నుంచి ఏఎంఎంకే వైదొలగడంతో దినకరన్ షాక్
సాయిపల్లవి సినిమాలు మాత్రమే…
“హీరోయిన్లలో సాయిపల్లవి సినిమాలకే మంచి క్రేజ్ ఉంది. మిగిలిన నాయకానాయికల సినిమాలను ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. వారి సినిమాలు చూసేందుకు థియేటర్లకు రావడం లేదు. నాగవంశీ, దిల్‌రాజు వంటి పెద్ద ప్రొడ్యూసర్లతో పాటు స్టార్ హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యర్ అన్నది ఇండస్ట్రీలో కామన్. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కంగారు పడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లాల్సిందే. కథ బాగుండి సినిమాలో దమ్ముంటే ఆడియెన్సే సినిమాను సక్సెస్ చేస్తారు” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
ఛాలెంజ్‌లు చేస్తున్నారు…
“ఈ రోజుల్లో ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌లు చేయడం కామన్‌గా మారిందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. చించేశాను, పొడిచేశాను అంటూ స్టేజ్‌పైనే ప్రేక్షకుల ముందు ఛాలెంజ్‌లు చేస్తున్నారు. సినిమా కోసం నేను అంత కష్టపడ్డాను, ఇన్నేళ్లు శ్రమించాను అంటూ చాలా మాట్లాడుతున్నారు. ఆడియెన్స్ సినిమాను చూసి తీరాల్సిందే అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. వారు పడుతున్న కష్టాన్ని ప్రేక్షకులు ఎందుకు చూడాలి. ప్రతి దర్శకుడు తమ సినిమా కోసం ప్రాణం పెట్టి అహర్నిశలు కష్టపడతాడు. అది నిజమే కానీ ఆ దర్శకుడి సినిమాను చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుల ఇష్టమే. ఆడియెన్స్‌కు చిన్న సినిమా… పెద్ద సినిమా అనే భేదాలు ఉండవు. నచ్చితే తప్పకుండా ఆదరిస్తారు” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read – Revanth Reddy: క్రైసిస్ మేనేజ్ మెంట్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు


