Mirai Day 1 Collections: హనుమాన్ (Hanu man) బ్లాక్ బస్టర్ విజయంతో యువ కథానాయకుడు తేజ సజ్జా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరోతో కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తేజ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నాడు. తన నమ్మకాన్ని సినిమా నిలబెట్టిందని మూవీ ట్రేడ్ వర్గాలంటున్నాయి. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్..
మిరాయ్ (Mirai) మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను రాబట్టుకుని వసూళ్లను రాబడుతోంది. హను మ్యాన్‌తో స్టార్‌గా మారిన తేజా సజ్జా (Teja Sajja) లేటెస్ట్ మూవీ మిరాయ్‌తో నెక్ట్స్ రేంజ్ స్టార్ డమ్‌ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది గతంలో వచ్చిన హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల కంటే ఎక్కువ కావడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణలో పది కోట్లకు పైగానే వచ్చింది. బాలీవుడ్‌లో రూ.1.25 కోట్లు, మిగిలిన రాష్ట్రాల్లో రూ. 15 లక్షలు వచ్చాయి. ఇక నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.5.5 కోట్లు వచ్చాయి. శని, ఆది వారాల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మూవీ సర్కిల్స్ అంటున్నాయి.
Also Read – Sleep: జాగ్రత్త..నిద్ర లేకపోతే ఈ రోగాలన్నీ క్యు కట్టేస్తాయ్!
తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతినాయకుడిగా మెప్పించారు. రితికా నాయక్ (Ritika Naik) హీరోయిన్. శ్రియా శరన్ (Shriya Saran), జయరాం తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad) దీన్ని నిర్మించారు. ధమాకా తర్వాత ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన హిట్ సినిమా ఇదేనని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నిర్మాత మిరాయ్ సక్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. షేర్ వసూళ్ల ప్రకారం సినిమా దాదాపు పదిహేను కోట్ల రూపాయలను (Mirai Collections) తొలిరోజులోనే రీచ్ అయ్యింది. మరో ముప్పై ఐదు కోట్లను రాబడితే సినిమాకు బ్రేక్ ఈవెన్ అయినట్లే. మరి శని, ఆది వారాల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.
Also Read – Egg: గుడ్డు….ఉడికించాలా లేక వేయించాలా?


