Mirai Success: తేజా సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన మిరాయ్ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. తేజా సజ్జా కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 23 – 25 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. 12 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.
100 కోట్ల కలెక్షన్స్…
తేజా సజ్జా, మంచు మనోజ్ (Manchu Manoj) యాక్టింగ్‌తో పాటు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నయి. టెక్నికల్‌గా టాలీవుడ్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శ్రీరాముడి ఎపిసోడ్ అదిరిపోయిందనే అంటున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ మిరాయ్‌కి పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ డే కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని అంటున్నారు. ఫుల్ థియేట్రికల్ రన్‌లో మిరాయ్ 100 కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దక్కించుకుంటున్నది చెబుతున్నారు.
Also read – Teja Sajja: మిరాయ్ హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా తేజ సజ్జా.. బయోగ్రఫీ ఇదే..!
రెమ్యూనరేషన్ పెంచేశాడు…
కాగా మిరాయ్ సక్సెస్‌తో తేజా సజ్జా తన రెమ్యూనరేషన్‌ను (Teja Sajja Remunaration) పెంచాడట. హనుమాన్, మిరాయ్ సినిమాల కోసం తేజా సజ్జా కేవలం రెండు కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మిరాయ్ ప్రమోషన్స్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా హనుమాన్ కోసం తేజా సజ్జా ఎంత తీసుకున్నాడో అదే రెమ్యూనరేషన్‌కు మిరాయ్ చేసినట్లు తెలిపాడు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో టాలీవుడ్‌లో తేజా సజ్జా క్రేజ్, మార్కెట్ పెరిగింది. అతడితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. హనుమాన్, మిరాయ్ సక్సెస్‌లను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడట తేజా సజ్జా. రెమ్యూనరేషన్‌ను ఐదింతలు పెంచాడట.
12 కోట్లు…
మిరాయ్ తర్వాత జాంబీ రెడ్డి సీక్వెల్‌లో తేజా సజ్జా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. జాంబీ రెడ్డి నిర్మించిన ప్రొడ్యూసర్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ తేజా సజ్జా రెమ్యూనరేషన్ విని షాకైన సదరు నిర్మాత సీక్వెల్ నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో టీజీ విశ్వప్రసాద్ జాంబీరెడ్డి 2ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సీక్వెల్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. జాంబీరెడ్డి 2కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నట్లు చెబుతున్నారు.


