Mirai Movie Release Date: మిరాయ్.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న సినిమా. అయితే, ఈ సినిమా సెప్టెంబర్ 5 విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల మిరాయ్ వాయిదా పడటం ఖాయమేనని ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటి వరకూ మిరాయ్ మూవీకి ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలకపోవడం, ఫెడరేషన్ సమ్మె కారణంగా బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ ఆగిపోవడం వల్ల ఫైనల్ కట్ ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఎంత డే అండ్ నైట్ అన్నీ పనులు పూర్తి చేసి 10 రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం అంటే అసాధ్యం. పైగా ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ లేకపోతే జనాలకి చేరదు. అందుకే, వాయిదా వేయాలనె మేకర్స్ దాదాపుగా ఫిక్సైనట్టు తెలిసింది. దీంతో సోషల్ మీడియా స్టార్ అయిన మౌళి హీరోగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ మూవీని సెప్టెంబర్ 5 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడైనా రావొచ్చు అంటున్నారు.
Also Read – Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిర్మాతలకు లీగల్ నోటీసులు.. రిలీజ్ ఎప్పుడంటే!
ఇక మిరాయ్ మూవీకి సోలోగా దొరికే డేట్ సెప్టెంబర్ 12 ఒకటే. కానీ, పోటీగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన కిష్కిందపురి సినిమా లాకై ఉంది. ఇది పెద్ద కాంపిటేషన్ కానప్పటికీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ఆ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవడమా లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడమా జరుగుతుంది. రవితేజ నటించిన మాస్ జాతర మూవీ రిలీజ్ అనేది ఇంకా తెలీలేదు.
ఇక సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ నటించిన ఓజి ఉంది. కానీ, ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనేది మరో లేటెస్ట్ టాక్. ఒకవేళ పోస్ట్ పోన్ కాకపోతే ఓజితో ఢీ కొట్టడం ఏరకంగా సేఫ్ కాదు. మిరాయ్ నిర్మాత టిజి విశ్వ ప్రసాదే ఇలా ఓజీతో పోటీకి ఒప్పుకోరు. కాబట్టి అక్టోబర్ కు పోస్ట్ పోన్ చేయడం తప్ప మిరాయ్ కు మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతానికి ఈ విషయంలో పక్కాగా క్లారిటీ రావాల్సి ఉంది.
హనుమాన్ లాంటి భారీ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో మిరాయ్ మూవీకి సోలో రిలీజ్ చాలా అవసరం. హనుమాన్ రిలీజ్ టైంలో సంక్రాంతి సీజన్ కాబట్టి, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ ని తట్టుకుని కంటెంట్ బలంగా ఉండి హిట్ కొట్టాడు తేజ సజ్జా. కానీ, ఇలా ప్రతీసారి కుదరదు. ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ నాన్ థియేటర్ రైట్స్ ద్వారా ఇప్పటికే, లాభాలు తెచ్చింది. కానీ, తేజ సజ్జ మార్కెట్ థియేటర్ రెవిన్యూ మీదే ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిరాయ్ మేకర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.
Also Read – Mahavatar Narsimha Updates: మహావతార్ దెబ్బకి మల్టీస్టారర్స్ అవుట్..


