Teja Sajja Mirai: హనుమాన్ మూవీతో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్నాడు యంగ్ హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కథాంశంతో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మహేష్‌బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ పోటీని తట్టుకొని 2024 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
ఫాంటసీ యాక్షన్ మూవీ…
హనుమాన్ సక్సెస్ తర్వాత మిరాయ్ పేరుతో ఫాంటసీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు తేజా సజ్జా. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మిరాయ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో తేజా సజ్జాతో పాటు ప్రధాన తారాగణంపై యాక్షన్, ఛేజింగ్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో మిరాయ్ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – Parenting Tips: పిల్లలతో సమయం గడపలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
రిలీజ్‌కు ముందే లాభాల్లోకి…
కాగా మిరాయ్ మూవీ రిలీజ్‌కు ముందే లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కలిసి 55 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా అన్ని భాషలకు చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. శాటిలైట్ రైట్స్‌ను కూడా స్టార్ నెట్‌వర్క్ దక్కించుకున్నది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తికాకముందే మిరాయ్ మూవీ లాభాల్లోకి ఎంటరైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
గట్టిగానే గిట్టుబాటు…
థియేట్రికల్ బిజినెస్ అటు ఇటుగా మరో యాభై కోట్ల వరకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిసి ప్రొడ్యూసర్లకు గట్టిగానే మిరాయ్ గిట్టుబాటు అయ్యేటట్లు కనిపిస్తోంది.
మంచు మనోజ్ విలన్…
మిరాయ్ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తేజా సజ్జాకు జోడీగా రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. జగపతిబాబు, శ్రియా, జయరామ్‌తో పాటు పలువురు దక్షిణాది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read – Aakanksha Singh: గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న మళ్లీరావా బ్యూటీ
చైల్డ్ యాక్టర్‌గా…
చూడాలని ఉంది సినిమాతో చైల్డ్ యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు తేజా సజ్జా. ఇంద్ర, గంగోత్రి, యువరాజుతో పలు సూపర్ హిట్ సినిమాల్లో బాల నటుడిగా మెప్పించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబీరెడ్డి సినిమాతో హీరోగా మారాడు తేజా సజ్జా.


