Mirai First Review: తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది. మైథలాజికల్ టచ్‌తో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రియా, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ టాక్ రావడం, ప్రమోషన్స్‌లో చిత్రబృందం చేస్తున్న కామెంట్స్‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్తయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. ఓవరాల్‌గా టేబుల్ ప్రాఫిట్ మూవీగా మిరాయ్ రిలీజ్ అవుతోంది.
Also Read- Lady Oriented Movies: లాభాల బాటలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్
రన్ టైమ్ ఎక్కువే…
కాగా మిరాయ్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల లాంగ్ రన్ టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యుల నుంచి మిరాయ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందట. మిరాయ్ మెయిన్ స్టోరీ ఏంటన్నది ట్రైలర్స్‌తో పాటు ప్రమోషన్స్‌లోనే మేకర్స్ హింట్ ఇచ్చేశారు. అశోక చక్రవర్తికి సంబంధించిన అతి పవిత్రమైన తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకోవాలని చూసే విలన్, శ్రీరాముడి సహాయంతో ఆ పవర్‌ఫుల్ విలన్‌ను ఓ సూపర్ హీరో ఎలా అడ్డుకున్నాడు? ఆ గ్రంథాలను ఎలా కాపాడాడు? అన్నది విజువల్ వండర్‌గా దర్శకుడు ఈ సినిమాలో చూపించినట్లు సెన్సార్ టాక్.
తొమ్మిది గ్రంథాల చరిత్రతో పాటు తేజా సజ్జా, మంచు మనోజ్ పాత్రల పరిచయ సన్నివేశాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయని అంటున్నారు. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంచెం టైమ్ తీసుకున్నారని చెబుతున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా రేసీగా సాగుతుందట, ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫీలింగ్‌ను కలిగిస్తుందని అంటున్నారు.
పూనకాలు ఖాయమే…
హీరో, విలన్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో మిరాయ్ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందట. ముఖ్యంగా శ్రీరాముడు కనిపించే సీన్స్‌కు థియేటర్లు మొత్తం పూనకాలతో ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. శ్రీరాముడితో పాటు మరో సర్‌ప్రైజింగ్ గెస్ట్ రోల్ కూడా మిరాయ్‌లో ఉంటుందట.
Also Read- Ap Govt: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. పెద్దగా ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వం
హాలీవుడ్ లెవెల్‌లో…
గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఓవరాల్‌గా కొన్ని చిన్న చిన్న మైనస్‌లు ఉన్నా పెట్టిన టికెట్ డబ్బులకు మిరాయ్ పూర్తిగా న్యాయం చేస్తుందని అంటున్నారు. మిరాయ్ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.


