యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మిరాయ్’ (Mirai). కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు’ అనే ఆసక్తికర డైలాగులతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించడం విశేషం. సూపర్ యోధ పాత్రలో తేజ నటన ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గౌరహరి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్నాన్ని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో సెప్టెంబర్ 5, 2025న 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.