Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMirai US Collections: ఓవర్సీస్‌లో ‘మిరాయ్’ మిరాకిల్.. ప్రభాస్, ఎన్టీఆర్ సరసన చేరిన తేజ సజ్జా

Mirai US Collections: ఓవర్సీస్‌లో ‘మిరాయ్’ మిరాకిల్.. ప్రభాస్, ఎన్టీఆర్ సరసన చేరిన తేజ సజ్జా

Mirai US Collections:: యంగ్ హీరో తేజ సజ్జా తన కెరీర్ ప్రారంభం నుండి క్రమంగా ఎదుగుతున్నాడు. రీసెంట్‌గా త‌ను క‌థానాయ‌కుడిగా నటించిన మిరాయ్ చిత్రంతో ఓవ‌ర్‌సీస్‌లో మిరాకిల్ క్రియేట్ చేయ‌టం విశేషం. ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి చిన్న పాత్రలతో మొదలైన తన జర్నీ ‘ఓ బేబీ’లో ప్రత్యేక పాత్రలో మెరిసి.. ఆ తరువాత ‘అద్భుతం’, ‘జాంబీరెడ్డి’ వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా గుర్తింపు పొందారు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మూవీతో తన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు తేజ. ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూ.300 కోట్ల‌ను వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

పాన్ ఇండియా హీరోగా మారిన తేజ స‌జ్జా త‌న స‌క్సెస్‌ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగాడు. అందులో భాగంగా పీపుల్ మీడియా బ్యాన‌ర్‌లో చేసిన మిరాయ్ మూవీతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రూ.150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవ‌ర్‌సీస్‌లోనూ మూవీ సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో, 3 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ని చేరుకోవ‌టం కొస మెరుపు. దీంతో తేజ స‌జ్జా స్టార్ హీరోలైన ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న చేయ‌టం విశేషం.

Also Read- Niharika Konidela : విడాకుల తర్వాత కుటుంబానికి దూరమయ్యా – నిహారిక కొణిదెల

నార్త్ అమెరికాలో శనివారం ఒక్కరోజు 55 వేల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆదివారంతో 3 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో వరుసగా రెండు సినిమాలతో (‘హనుమాన్’, ‘మిరాయ్’) 3 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను సాధించిన మూడో తెలుగు హీరోగా తేజ సజ్జా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు కేవలం ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. తాజాగా తేజ సజ్జా వారి సరసన చేరడం టాలీవుడ్‌కు గర్వకారణం. మెగా హీరోలు లేదా ఇతర కాంపౌండ్ హీరోలకు సైతం సాధ్యం కాని ఈ రికార్డును కేవలం ఐదంటే ఐదు చిత్రాల్లో హీరోగా నటించి తేజ సాధించడం విశేషం.

‘ఓజీ’ సునామీలోనూ.. రిలీజై రెండు వారాలు దాటుతున్నా‘మిరాయ్’ తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఇంకా దుమ్మురేపుతోంది. ప్రస్తుతం విడుదలైన ‘ఓజీ’ సునామీలోనూ ఈ చిత్రానికి టిక్కెట్లు తెగుతున్నాయంటే ప్రేక్షకులలో ఎంతలా ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం ‘ఓజీ’ కంటే ఎక్కువగా కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జా ‘సూపర్ యోధ’గా మరోసారి మెప్పించారు. మంచు మనోజ్ ఇందులో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రితికా నాయక్, శ్రియ, జగపతిబాబు, జయరాం, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘మిరాయ్’ సాధించిన ఈ విజయోత్సాహంతో, మేకర్స్ ఇప్పటికే ‘మిరాయ్ 2’ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Also Read- Pawan Kalyan Asia Cup 2025 : ఆసియా కప్ 2025 విజయంపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad