Mirai Business: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అనేక చిత్రాలలో నటించి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు తేజ సజ్జా (Teja Sajja). ‘హనుమాన్’ చిత్రంతో అద్భుతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కథానాయకుడిగా నటించినప్పటికీ హనుమాన్ తర్వాత తేజ సజ్జా ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఈ యువ కథానాయకుడు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి రాలేదు. అయితే సెప్టెంబర్ 5న మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా పడుతుందని సమాచారం.
Also Read- Comedian Ramachandra: పక్షవాతంతో పోరాడుతున్న టాలీవుడ్ కమెడియన్.. సాయం కోసం ఎదురు చూపులు
సినీ సర్కిల్స్ సమాచారం మేరకు, మిరాయ్ మూవీని సెప్టెంబర్ 12న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మిరాయ్ నాన్ థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్టు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రూ.38 కోట్లకు నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడైంది. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా బడ్జెట్ పక్కన పెడితే ఓ యంగ్ హీరో సినిమాకు ఇంత భారీ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ రావటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరి థియేట్రికల్ హక్కులతోనే టేబుల్ ప్రాఫిట్ పొందిన ఈ సినిమా.. డిజిటల్, శాటిలైట్ ఎలాంటి ఆఫర్స్‌ను దక్కించుకుంటాయో చూడాలి.
‘హనుమాన్’ (Hanu man) తర్వాత తేజ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్’. మొదటి నుంచీ మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జ.. ‘జై హనుమాన్’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అప్‌డేట్ రాబోతుందని సమాచారం. ‘మిరాయ్’ విడుదల ఆలస్యమవుతున్నప్పటికీ, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన భారీ లాభాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. లోకాన్ని దుష్టశక్తి నుంచి కాపాడే యోధుడి పాత్రలో తేజ సజ్జా కనిపించనున్నాడు. అతని చేతిలో ఆయుధమే మిరాయ్. దీని అసలు బ్యాక్ డ్రాప్ ఏంటనేది సినిమా చూస్తే కానీ తెలియదు.


