Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTeja Sajja: జాంబిరెడ్డి సీక్వెల్ కి రెడీ

Teja Sajja: జాంబిరెడ్డి సీక్వెల్ కి రెడీ

Teja Sajja: చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్నాడు. ఓ బేబి సినిమాలో మంచి రోల్ చేసి ఆకట్టుకున్న తేజ జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీని తర్వాత నటించిన హను మాన్ తేజకి మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచింది. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా పాపులర్ అయినా హీరోగా సక్సెస్ కాలేకపోయారు.

- Advertisement -

కానీ, తేజ సజ్జా మాత్రం ఎంచుకుంటున్న సినిమాలతో తన సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాల కాంబినేషన్ కి కూడా మంచి పేరొచ్చింది. వీరి కాంబినేషన్ లో హను మాన్ సీక్వెల్ రూపొందుతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించబోతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇంతకముందు బ్లాక్ బస్టర్ సాధించిన జాంబిరెడ్డి సీక్వెల్ మూవీ కూడా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జానే నటిస్తుండటం అందరిలో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

Also Read – Mythological Movies: టాలీవుడ్‌లో మైథాల‌జీ ట్రెండ్ – కాసులు కురిపిస్తున్న డివోష‌న‌ల్ మూవీస్‌

తేజ ప్ర‌స్తుతం మిరాయ్ మూవీ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరో త‌న త‌ర్వాతి సినిమాగా జాంబిరెడ్డి2 ను చేయ‌బోతున్నాడు. యంగ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తేజ స‌జ్జా న‌టించిన జాంబిరెడ్డి సినిమా 2021 ఫిబ్ర‌వ‌రిలో రిలీజైంది. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబట్టింది. దీంతో పాటూ ఓటీటీల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల కాలంలో తేజ సజ్జా లాంటి చిన్న వయసు హీరో నటించిన పెద్ద హిట్ అంటే ఈ చిత్రాలనే చెప్పొచ్చు. ఇప్పుడు జాంబిరెడ్డికి పార్ట్ 2 రూపొందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

అయితే, జాంబి రెడ్డి సినిమా సీక్వెల్ నే తేజ త‌న నెక్స్ట్ మూవీగా చేయ‌బోతున్నాడు. వాస్త‌వానికి జాంబిరెడ్డి2 ను గతంలో సితార నాగ వంశీ నిర్మిస్తార‌ని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్టును మిరాయ్ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీనే టేకప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ స్క్రిప్ట్ ను అందించ‌నున్నారు. ఇక డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం మేకర్స్ ఫిక్స్ చేయలేదు. ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ని రూపొందించిన డైరెక్ట‌ర్ సుప‌ర్ణ్ వర్మ పేరు బాగా వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. కాగా, తేజ న‌టించిన మూడు చిత్రాలు వరుసగా హిట్ సాధించడం విశేషం.

Also Read – Relationship Tips: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా?.. అయితే ఇట్టే గుర్తుపట్టొచ్చు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad