Film Chamber : హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమలో 17 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సినిమా షూటింగ్‌లను స్తంభింపజేసింది. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఆగిపోయాయి. కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు ఆర్థిక నష్టాల కారణంగా అంగీకరించలేకపోతున్నారు. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ బహుసార్లు చర్చలు జరిపినా, సమస్యకు పరిష్కారం దొరకలేదు. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకున్నా ఫలితం కనిపంచలేదు.
ALSO READ: Medaram Jatara: మహా జాతరకు నిర్వహణకు రూ. 150 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె అడ్డంకిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు నిర్మాతలతో, 4 గంటలకు కార్మిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశారు.
ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్‌కు నాలుగు షరతులతో కూడిన లేఖ రాసింది, అయితే కార్మికులు దీన్ని ఒప్పుకుంటారా అనేది సందేహంగా ఉంది. ప్రభుత్వ జోక్యంతో సమ్మె త్వరలో ముగిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులకు గృహాలు, గద్దర్ అవార్డు వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా సినీ పరిశ్రమకు మద్దతు ఇస్తున్నారు. ఈ చర్చలు సఫలమైతే, హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నారు.


