Naga Durga: ‘దారిపొంటత్తుండు..’ అనే ఫోక్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌లో యాక్ట్ చేసిన కూచిపూడి డాన్సర్, తెలంగాణ జానపద కళాకారిణి నాగదుర్గ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సాంగ్ అయితే యూ ట్యూబ్‌ను షేక్ చేసేసింది. 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈమె నటి కూడా. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నాగదుర్గ యాక్ట్ చేసింది. అయితే ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. ఈ నేపథ్యంలో ‘దారిపొంటత్తుండు..’ సాంగ్ తెచ్చిన క్రేజ్‌తో ఈమెకు ఓ క్రేజీ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
నాగదుర్గ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ్ హీరోగా ఓ సినిమా షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. మగేష్ రాజేంద్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దీనిపై అటు మేకర్స్ కానీ.. ఇటు నాగదుర్గ కానీ స్పందించలేదు. ఇదే కనుక నిజమైతే మాత్రం నాగదుర్గకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనని సినీ సర్కిల్స్ అంటున్నాయి.
Also Read – CM Revanth Reddy: సినీ కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
పవీష్ నారాయణ గురించి చెప్పాలంటే ఇతను హీరోగా ధనుష్ దర్శకత్వంలోనే ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ సినిమా రూపొందింది. దీన్ని తెలుగులో జాబిల్మా నీకు అంత కోపమా పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగలోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పవీణ్ నారాయణ్ రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ముఖ్యంగా నాగదుర్గను హీరోయిన్‌గా ఎంచుకోవటం వెనుక ఉన్న కారణమేంటనేది సినిమా రిలీజ్ ముందు కానీ తెలియదు. ఈ సినిమా హిట్ అయితే నాగదుర్గ తమిళంలో మరిన్ని అవకాశాలను అందుకుంటుందనటంలో సందేహం లేదు. తెలుగు మేకర్స్ కూడా ఆమెకు అవకాశాలు కల్పిస్తారు.
Also Read – Ramayana: రెమ్యూనరేషన్ లేకుండా రామాయణ సినిమా చేస్తున్న బాలీవుడ్ స్టార్ – నెటిజన్ల ప్రశంసలు


