Bigg Boss 9 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 కొన్ని గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది. నిర్వాహకులు దీనికి కావాల్సిన అన్నింటినీ సిద్ధం చేసేశారు. ఈవెంట్ ప్రారంభం చాలా గ్రాండ్‌గా జరగబోతోంది. ఆదివారం సాయంత్రం నుంచి కౌంట్ డౌన్ షురూ కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్స్ నుంచి ఎంకరేజ్ చేస్తోన్న ఆడియెన్స్, అభిమానులు కొత్త సీజన్‌ను ఎంజాయ్ చేయటానికి రెడీ అయిపోయారు. హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించటానికి ‘అగ్ని పరీక్ష’ అనే కాంటెస్ట్‌ను నిర్వహించారు. దీని ద్వారా ఐదుగురు సామాన్యులను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో ప్రముఖంగా వినిపించిన ఒక పేరు.. తెలంగాణకు చెందిన ఫేమస్ యూట్యూబర్ కమ్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ. ఆమె బిగ్ బాస్‌లోకి వస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ వార్తలపై ఆమె స్వయంగా స్పందించారు.
కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో నాగదుర్గ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనుందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా స్పష్టత ఇచ్చారు. తాను బిగ్‌బాస్ 9వ సీజన్‌కు వెళ్లడం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ షోకి వెళ్లాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదని కూడా ఆమె పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటితోనైనా ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆమె కోరారు.
ఎవరీ నాగదుర్గ?
నల్గొండకు చెందిన నాగదుర్గ, ‘తిన్నాతిరం పడతలే’, ‘ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి’, ‘దారిపొంటత్తుండు’, ‘నా పేరే ఎల్లమ్మ’ వంటి జానపద పాటలతో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ఫోక్ సాంగ్స్‌కు వేసిన స్టెప్పులకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘తిన్నాతిరం పడతలే’ పాట ఏకంగా వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. నాగదుర్గ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లోనూ ఎంతో నైపుణ్యమున్న కళాకారిణి. ఆమె ఇప్పటివరకు 1600కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/allu-arjun-siima-2025-hattrick-thanks-speech/
అంతేకాకుండా, ‘నాగదుర్గ నృత్యాలయం’ పేరుతో ఎంతో మందికి ఉచితంగా నృత్య శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆమె ప్రతిభను చూసి గతంలో నాని ‘శ్యామ్ సింగరాయ్’, విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో అవకాశం లభించింది. అయితే, నృత్యంపై ఉన్న అంతులేని ప్రేమతో, డాక్టరేట్ సాధించాలనే తలంపుతో ఆ సినిమా ఆఫర్‌లను ఆమె తిరస్కరించారు.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/sandeep-reddy-vanga-sensational-comments-on-bahubali-movie/


