Rishab Shetty: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఈ కన్నడ డబ్బింగ్ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కాంతారకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది.
బాయ్‌కాట్ కాంతార…
రిలీజ్‌కు ముందు కాంతార చాప్టర్ వన్ సినిమా చిక్కుల్లో పడింది. కాంతార సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ తెలుగు ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు. హీరో రిషబ్ శెట్టిని సోషల్ మీడియాలో దారుణంగా ఏకిపడేస్తున్నారు. ప్రస్తుతం బాయ్‌కాట్ కాంతార హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
కన్నడంలోనే స్పీచ్…
రిషబ్ శెట్టిపై తెలుగు ఆడియెన్స్ ఇంతలా ఫైర్ కావడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణం. ఆదివారం జరిగిన కాంతార చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడంలోనే మాట్లాడాడు. ఇతర భాషలకు చెందిన హీరోహీరోయిన్లకు తెలుగు రాకపోయినా అందరికి నమస్కారం అంటూ కనీసం తెలుగు పదంతో తమ స్పీచ్‌ను మొదలుపెడతారు. ఆ మాట కూడా రిషబ్ శెట్టి నోటి నుంచి రాలేదు. తన మాతృభాషలోనే స్పీచ్ మొదలుపెట్టి చివరి వరకు కన్నడంలోనే మాట్లాడాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం గురించి కూడా రిషబ్ శెట్టి ఇంగ్లీష్‌లో కాకుండా కన్నడంలో చెప్పాడు. ఒక్కసారి కూడా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించకపోవడంతో నెటిజన్లు రిషబ్ శెట్టిని ట్రోల్ చేస్తున్నారు.
కాంతార చాప్టర్ వన్ చెన్నై ఈవెంట్‌లో తమిళం, బాలీవుడ్ ప్రమోషన్స్‌లో హిందీ, మలయాళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మలయాళంలోనే రిషబ్ శెట్టి మాట్లాడాడు. కానీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం పూర్తిగా కన్నడంలోనే మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కన్నడ భాషాభిమానాన్ని ఇక్కడ చూపిస్తే కుదరదంటూ ట్రోల్ చేస్తున్నారు. కాంతార ఛాప్టర్ వన్ సినిమాను తెలుగు ఆడియెన్స్ ఎవరూ చూడొద్దని సోషల్ మీడియాలో కామెంట్స్, ట్వీట్స్ పెడుతున్నారు.
Also Read – Ritika Nayak: గ్రీన్ శారీలో కుర్రాళ్లకు గాలం వేస్తున్న రితికా
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా…
ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రదర్శనను కర్ణాటకలో కొన్ని చోట్ల అడ్డుకున్నారు. తెలుగు సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేయద్దంటూ పోస్టర్స్ చింపివేశారు. ఆ సంఘటనను కూడా గుర్తు చేస్తూ కాంతార ఛాప్టర్ వన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. తెలుగు భాష, సినిమాలపై గౌరవం ఉండదు. కానీ మీ సినిమాలను మాత్రం మేము చూడాలా? ఇది ఎంత వరకు న్యాయం అని రిషభ్ శెట్టిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
డబ్బింగ్ సినిమాలే…
బాయ్‌కాట్ కాంతార చాప్టర్ వన్ ట్రెండ్ ఓపెనింగ్స్‌పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ దసరాకు ఒక్క తెలుగు స్ట్రెయిట్ సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. కాంతార ఛాప్టర్ వన్‌తో పాటు ధనుష్ ఇడ్లీకొట్టు సినిమాలు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దసరా బరిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం ఆడియెన్స్‌ను విస్మయపరుస్తోంది.
కాంతార చాప్టర్ వన్ సినిమాకు రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
Also Read – Bigg Boss 9 Telugu: ప్రియా శెట్టి ఎలిమినేట్.. 3 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతంటే?


