National Awards For Telugu Cinemas: కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ అవార్డులను ప్రకటించింది. నాన్ ఫీచర్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ కు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈసారి కూడా తెలుగు సినిమాలు తమ సత్తాను చాటాయి. ప్రేక్షకులను రంజింప చేయటంతో పాటు ఇన్‌స్పిరేషనల్‌గా నిలిచిన తెలుగు సినిమాలు అవార్డులను దక్కించుకోవటం విశేషం.
ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది.. భగవంత్ కేసరి గురించే. బాలకృష్ణ హీరోగా శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అనీల్ రావిపూడి తెరకెక్కించారు. తండ్రీ కూతురి మధ్య అనుబంధాన్ని తెలియజేసే సినిమా ఇది. కుమార్తె అభ్యున్నతికి పాటుపడే తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించారు. కూతురుని చదివించి ఆర్మీ ఆఫీసర్ చేయాలనే కోరికతో కష్టపడే తండ్రిగా బాలయ్య ఇందులో నటించగా, కుమార్తె పాత్రలో శ్రీలీల నటించింది.
Also Read – 71st National Film Awards: భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్
టీనేజ్ లవ్ స్టోరీ బేస్డ్‌గా రూపొందిన బేబి సినిమాకు బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేష్‌కు జాతీయ అవార్డ్ దక్కింది. నేటి తరం ప్రేమికులు ఎలా ఉన్నారు.. వారి ఆలోచనల కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే విషయాన్ని సాయి రాజేష్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. అలాగే ఈ సినిమాలో పాటలకు మంచి ఆదరణ దక్కింది. అందులో భాగంగా ఉత్తమ నేపథ్య గాయకుడిగా ‘ప్రేమిస్తున్నా’ పాట పాడిన పి.వి.ఎన్.ఎస్.రోహిత్ అవార్డును దక్కించుకున్నారు.
నేషనల్ అవార్డ్ దక్కించుకున్న మరో తెలుగు సినిమా హను మ్యాన్. గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్ దొరక్క అతి కష్టం మీద తక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. భగవంతుడి శక్తి భక్తుడిని ఎలా కాపాడింది. చివరకు భక్తుడు ఇబ్బందుల్లో పడితే భగవంతుడు ఏం చేశాడనే కథాంశంతో హను మ్యాన్ తెరకెక్కింది. దీంతో పాటు ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ ఈ మూవీ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో పాటు డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ప్రధాన పాత్ర పోషించిన గాంధీతాత చెట్టు సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చింది.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తెలుగువారు తమదైన మార్క్ చూపించారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అనిమల్ సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డ్ తో పాటు బెస్ట్ రీ రికార్డింగ్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా సార్. దర్శకుడు కూడా మన తెలుగు వాడైన వెంకీ అట్లూరి. ఈ సినిమా బేస్ చెప్పాలంటే తెలుగు సినిమానే అయినప్పటికీ తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందింది. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జి.వి.ప్రకాష్ అవార్డ్ దక్కించుకున్నారు.
Also Read – Mrunal Thakur Birthday: మృణాల్ ఠాకూర్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్


