Badmashulu OTT: తెలుగు కామెడీ మూవీ బద్మాషులు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. టాలీవుడ్ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ కామెడీ సినిమాలో బలగం ఫేమ్ మురళీధర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి కీలక పాత్రలు పోషించారు. శంకర్ చేగూరి దర్శకత్వం వహించాడు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో…
జూన్ ఫస్ట్ వీక్‌లో బద్మాషులు మూవీ థియేటర్లలో రిలీజైంది. పలు తెలుగు సినిమాల్లో కమెడియన్లుగా కనిపించిన మహేష్ చింతల, విద్యాసాగర్ బద్మాషులు మూవీతోనే హీరోలుగా మారారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ట్రైలర్, టీజర్‌తో పాటు వెరైటీ ప్రమోషన్స్‌లో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆడియెన్స్‌ను నవ్వించాలనే ప్రయత్నంలో కామెడీపై ఫోకస్ పెట్టిన దర్శకుడు కథను పట్టించుకోకపోవడంతో బద్మాషులు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జాతిరత్నాలుతో పాటు గతంలో వచ్చిన కొన్ని కామెడీ సినిమాలను పోలి కథ ఉండటం కూడా మైనస్‌గా మారింది.
Also Read – Wlaking: బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని వేల అడుగులు వేయాలి?
బద్మాషులు స్టోరీ ఏంటంటే?
తెలంగాణలోని కోతులగూడానికి చెందిన తిరుపతి, ముత్యాలు ప్రాణ స్నేహితులు. తిరుపతి ట్రైలర్‌గా పనిచేస్తాడు. ముత్యాలు బార్బర్. సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. ఓ సారి మందు తాగడానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేస్తూ పోలీసులకు దొరుకుతారు. అయినా తిరుపతి, ముత్యాలులో మార్పు రాదు. ఆ ఊరి స్కూల్‌లో ఉన్న ఓ కంప్యూటర్ మిస్సవుతుంది. అది తిరుపతి, ముత్యాలు దొంగతనం చేశారని పోలీసులు అనుమానిస్తారు. అసలు దొంగను కానిస్టేబుల్ రామ్‌చందర్ సాయంతో తిరుపతి, ముత్యాలు ఎలా పట్టుకున్నారు? తాగుబోతు స్నేహితుల్లో ఎలా మార్పు వచ్చింది అన్నదే బద్మాషులు మూవీ మిగిలిన కథ.
తరుణ్ భాస్కర్ సినిమాల్లో…
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది, కీడాకోలా సినిమాలతో కమెడియన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు మహేష్ చింతల. మాయాబజార్‌తో పాటు మరికొన్ని తెలుగు వెబ్‌సిరీస్‌లో నటించాడు.
Also Read – Mansoon:వర్షాకాలంలో కూడా చెమట వాసన పోవట్లేదా…!


