Kothapalli Lo Okappudu: హీరో రానా దగ్గుబాటి నిర్మించిన తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఆగస్ట్ 22 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అఫీషియల్‌గా శుక్రవారం అనౌన్స్‌చేసిన ఆహా ఓటీటీ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
దర్శకురాలే నిర్మాత…
కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీలో మనోజ్ చంద్ర, మోనిక, ఉషా, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తునే ఇందులో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాను ప్రవీణ పరుచూరినే నిర్మించింది. గతంలో కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణ పరుచూరి కొత్తపల్లిలో ఒకప్పుడుతో డైరెక్టర్‌గా మారింది.
Also Read – Akhanda 2: పవన్ కి పోటీ..
కమర్షియల్‌గా మాత్రం…
రానా దగ్గుబాటి ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ మూవీ జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పల్లెటూళ్లలోని అసమానతలకు, మూఢనమ్మకాలను ఫన్నీగా ఈ మూవీలో చూపించారు మేకర్స్. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నంగా సినిమాకు పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆర్ట్ సినిమాలా కథనం సాగడం, తెలిసిన యాక్టర్లు ఎవరూ సినిమాలు లేకపోవడం మైనస్‌గా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీకి మణిశర్మ సాంగ్స్ సమకూర్చగా… వరుణ్ ఉన్ని బీజీఎమ్ అందించారు.
రామకృష్ణ ప్రేమాయణం…
కొత్తపల్లిలో వడ్డీల పేరుతో జనాలను పీడిస్తుంటాడు అప్పన్న. అతడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూనే ఓ రికార్డింగ్ స్టూడియో నడుపుతుంటాడు రామకృష్ణ. సావిత్రి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు రామకృష్ణ. వారి ప్రేమకు అందం అలియాస్ అదిలక్ష్మి మీడియేటర్‌గా ఉంటుంది. అనుకోని పరిస్థితుల వల్ల అందాన్ని రామకృష్ణ పెళ్లిచేసుకోవాలని ఊరి పంచాయితీ తీర్పు ఇస్తుంది. అలా ఎందుకు జరిగింది? సావిత్రిని ప్రేమిస్తున్న సంగతి రామకృష్ణ ఎలా బయటపెట్టాడు? అప్పన్నను దేవుడిగా జనాలు భావించడానికి కారణం ఏమిటి? అన్నదే కొత్తపల్లిలో ఒకప్పుడు మిగిలిన కథ.
Also Read – Fauji: రిలీజ్ డేట్ ఇదేనా..?


