Diwali Releases: ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మిడ్ రేంజ్ హీరోలు సందడి చేయబోతున్నారు. ఈ పండుగకు నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కామెడీ, రొమాంటిక్ అంశాలతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనే లక్ష్యంతో నలుగురు హీరోలు బరిలోకి దిగబోతున్నారు. ఇందులో ప్రేక్షకులను మెప్పించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుసు కదా…
దీపావళి సినిమాల్లో తెలుసు కదా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. మిత్రమండలి తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోంది. అయితే బజ్ పరంగా మిత్రమండలికే ఎక్కువగా ఉండగా.. తెలుసు కదా తక్కువ హైప్‌తో థియేటర్లలోకి రాబోతున్నాయి.
Also Read- Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు జోడీగా కోలీవుడ్ బ్యూటీ!
ఇరవై కోట్లు…
సిద్ధు జొన్నలగడ్డకు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుసు కదా థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లు, వరల్డ్ వైడ్‌గా ఇరవై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ ట్రయాంగిల్ లవ్ డ్రామా మూవీ రిలీజ్ అవుతోంది. నైజాంలో తెలుసు కదా మూవీ థియేట్రికల్ రైట్స్ ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఆంధ్రాలో 6.3 కోట్లు, సీడెడ్‌లో 2.52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్. తెలుసు కదా ట్రైలర్‌కు మిక్స్‌డ్ టాక్ రావడం, ప్రమోషన్స్‌లో మిగిలిన సినిమాలతో పోలిస్తే వెనుకబడటంతో సిద్దు జొన్నలగడ్డ అండ్ టీమ్‌కు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడం పెద్ద సవాల్‌గానే మారింది. ‘తెలుసు కదా’ మూవీకి నీరజ కోన దర్శకత్వం వహించింది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
డ్యూడ్…
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో డ్యూడ్ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ నెలకొంది. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ రెండు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. డ్యూడ్‌తో హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశాడు. డబ్బింగ్ మూవీ అనే విమర్శలను దాటుకొని ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సిందే.
సింపుల్ టార్గెట్….
కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మోస్తారుగానే జరిగింది. ఏడున్నర కోట్ల సింపుల్ టార్గెట్‌తో కే ర్యాంప్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కే ర్యాంప్ మూవీ థియేట్రికల్ రైట్స్ 6.40 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నైజాంలో కంటే ఆంధ్రాలోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు ఎక్కువగా డిమాండ్ కనిపించింది. ఆంధ్రాలో 3.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, నైజాంలో 1.98 కోట్లు బిజినెస్ చేసింది. కే ర్యాంప్‌లో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించాడు.
Also Read- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై ఇంతలోనే అలుసా? మాకొద్దీ గూడంటూ వెనకడుగు వేస్తున్న లబ్ధిదారులు!
మిత్రమండలి
ఈ దీపావళికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో మిత్రమండలిపైనే ఎక్కువగా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. ఇందులో స్టార్స్ ఎవరూ లేకపోయినా అగ్రెసివ్ ప్రమోషన్స్‌తో పాటు ట్రైలర్, టీజర్‌లలోని కామెడీ వర్కవుట్ కావడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. మిత్రమండలి థియేట్రికల్ బిజినెస్ నాలుగు కోట్ల వరకు జరిగింది. ఈ సినిమాను బన్నీ వాస్ ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాడు. మిత్రమండలి మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దర్శకత్వం వహించాడు.


