Tollywood: టాలీవుడ్‌కు సెప్టెంబర్ బాగా కలిసివచ్చింది. ఈ నెలలో రిలీజైన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కిందపురితో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేశాయి. ఇదే సక్సెస్ జోష్‌ను అక్టోబర్‌లో కూడా కొనసాగాలని దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు.
అక్టోబర్‌లో దసరాతో పాటు దీపావళి పండుగలు వస్తుండటంతో ఈ హాలీడే సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈ నెలలో అగ్ర హీరోల సినిమాలో బరిలో లేకపోవడం ఒక రకంగా ఫ్యాన్స్ నిరాశగానే చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు అక్టోబర్‌లో తమ సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు.
డబ్బింగ్ సినిమాలు…
అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఓజీకి గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్న మేకర్స్ దసరాను వదిలేశారు. రిషబ్ శెట్టి కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార చాప్టర్ వన్‌తో పాటు ధనుష్ తమిళ అనువాద బొమ్మ ఇడ్లీకొట్టు అక్టోబర్ 2న రిలీజ్ అవుతోన్నాయి. ఓజీ హవాను తట్టుకొని ఈ రెండు అనువాద సినిమాలు ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తాయన్నది చూడాల్సిందే.
శశివదనే… కానిస్టేబుల్…
అక్టోబర్ రెండో వారంలో శశివదనేతో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ రిలీజ్ కాబోతున్నాయి. శశివదనే మూవీలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ డైరెక్టర్. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. అక్టోబర్ ఫస్ట్ హాఫ్ డల్‌గా సాగిన సెకండాఫ్ మాత్రం సినిమాల జోరు గట్టిగానే ఉండబోతుంది.
Also Read – H-1B Visa Fee Hike: ట్రంప్ H-1B వీసా ఫీజు పెంపు.. కీలక పనులను భారత్‌కు తరలించాలని యూఎస్ కంపెనీల యోచన!
కే ర్యాంప్ వర్సెస్ తెలుసు కదా…
అక్టోబర్ 16న చిన్న సినిమా మిత్రమండలి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా కనిపించబోతున్నాడు. అక్టోబర్ 17న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా థియేటర్లలోకి వస్తోంది.. స్టైలిష్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాల్లో తెలుసు కదాపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.. అదే రోజు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీ డ్యూడ్ కూడా రిలీజ్ అవుతోంది. ప్రదీప్ రంగనాత్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించాడు.
అక్టోబర్ 18న కే ర్యాంప్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఇటీవల రిలీజైన టీజర్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఈ మూవీ అట్రాక్ట్ చేసింది.
రవితేజ వర్సెస్ ప్రభాస్…
అక్టోబర్ నెలాఖరున రవితేజతో పాటు ప్రభాస్ సినిమాలు పోటీపడనున్నాయి. బాహుబలి ఎపిక్ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి రెండు పార్ట్‌లను ఒకే పార్ట్‌గా ట్రిమ్ చేసి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. బాహుబలి ఎపిక్ రీ రిలీజ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
మాస్ జాతర…
అక్టోబర్ 31న రవితేజ మాస్ జాతర కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. వినాయక చవితికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ డిలే వల్ల వాయిదాపడింది. మాస్ జాతర మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read – Accenture Lays Off: యాక్సెంచర్ భారీ లేఆఫ్‌లు.. AI నైపుణ్యాలు లేవని 11,000 మంది తొలగింపు


