Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTelusu Kada: 'తెలుసు కదా 'బిగ్ అప్‌డేట్ ట్రైలర్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు!

Telusu Kada: ‘తెలుసు కదా ‘బిగ్ అప్‌డేట్ ట్రైలర్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు!

Telusu Kada: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘తెలుసు కదా’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల సిద్ధు నటించిన ‘జాక్’ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో, అతని కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను పెంచింది.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-diwali-2025-new-directors-debut/

ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం సంపాదించుకున్న నీరజ, తన మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
సిద్ధుతో పాటు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. మూవీ టీమ్ మొత్తం ఔట్‌పుట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/sai-dharam-tej-allu-arjun-controversy/

ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల ఎప్పుడంటే…

సిద్ధు ఫ్యాన్స్ మరియు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.’తెలుసు కదా’ ట్రైలర్‌ను రేపు (అక్టోబర్ 13, సోమవారం) ఉదయం 11:34 నిమిషాలకు విడుదల చేయనున్నారు.ఈ దీపావళి వీకెండ్‌లో అంటే అక్టోబర్ 17న ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్‌గా ఉండడంతో, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad