Jana Nayagan: దళపతి విజయ్ తన సినిమాలకు గుడ్‌బై చెప్పి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకే విజయ్ నటిస్తున్న చివరి సినిమా చెప్తున ‘జన నాయగన్’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో అజిత్ తో యాక్షన్ డ్రామాలు తీసిన వినోద్, ఇప్పుడు విజయ్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అని అంతా చూస్తున్నారు. రాబోయే సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ‘దళపతి కచేరీ’ రిలీజ్ చేశారు. సాంగ్ వచ్చిన వెంటనే యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టింది, కానీ ఈ రికార్డుల విషయం పక్కన పెడితే, సినిమా గురించిన ఒక చర్చ మాత్రం ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది.
ALSO READ: SSMB29: రాజమౌళి నెక్ట్స్ లెవల్ ప్లాన్, మహేష్ ఫస్ట్ లుక్ కోసం భారీ స్టేజ్ రెడీ!
ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునే ఒకే ఒక విషయం ఏంటంటే, ఇది బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేకా కాదా అని. మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు, అందులో కనిపించిన విజయ్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి చాలా మందికి ఈ అనుమానం వచ్చింది. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘దళపతి కచేరీ’ కూడా రిలీజ్ అయ్యాక, ఆ అనుమానం దాదాపు ఖాయమైపోయింది. పాటలో విజయ్ లుక్, ఆయన క్యారెక్టరైజేషన్, అంతకుమించి హెచ్. వినోద్ స్టైల్… అన్నీ కూడా ‘భగవంత్ కేసరి’ని గుర్తు చేస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ “మేము కేవలం ‘భగవంత్ కేసరి’ లోని కొన్ని సీన్స్, ఐడియాల హక్కులు మాత్రమే తీసుకున్నాం, పూర్తి రీమేక్ కాదు” అని చెబుతున్నా, పాట చూస్తే మాత్రం అచ్చం ఆ కథే తీసుకున్నట్టు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Diwali Movies: ఓటీటీలో సినిమాల వర్షం.. ఒకే రోజు రిలీజ్!
విజయ్ లాంటి పెద్ద స్టార్, తన చివరి సినిమాగా ఒక రీమేక్ కథను ఎంచుకోవడం ఫ్యాన్స్‌కు కొంచెం బాధగానే ఉంది. అయితే, హెచ్. వినోద్ లాంటి డైరెక్టర్ తనదైన స్టైల్లో, పక్కా మాస్ టచ్‌తో విజయ్‌ని ఎలా చూపిస్తాడు, కథను ఎలా మారుస్తాడు అనేది ఆసక్తిగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి, ఈ సినిమా ద్వారా ఆయన ప్రజలకు ఎలాంటి బలమైన మెసేజ్ ఇస్తాడో అనే ఆసక్తి కూడా ఉంది. మొత్తం మీద, ‘భగవంత్ కేసరి’ రీమేక్ చర్చ పక్కన పెడితే, సంక్రాంతికి ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మాత్రం తెలుస్తోంది. ఇక రీమేక్ సస్పెన్స్‌కు తెరపడాలంటే, సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.


