Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSankranthi 2026: జ‌న‌నాయ‌గ‌న్ వ‌ర్సెస్ రాజాసాబ్ - ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంక్రాంతి పోరు

Sankranthi 2026: జ‌న‌నాయ‌గ‌న్ వ‌ర్సెస్ రాజాసాబ్ – ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంక్రాంతి పోరు

Sankranthi 2026: ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. సంక్రాంతి రేసు నుంచి ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ త‌ప్పుకుంటున్న‌ట్లు వ‌స్తోన్న రూమ‌ర్స్‌కు మేక‌ర్స్ గురువారం చెక్ పెట్టారు. ఇటీవ‌ల ద‌ళ‌ప‌తి విజ‌య్ పొలిటిక‌ల్ పార్టీ మీటింగ్‌లో తొక్కిస‌లాట జ‌రిగి కొంద‌రు అభిమానులు క‌న్నుమూశారు. ఈ సంఘ‌ట‌న కార‌ణంగా జ‌న‌నాయ‌గ‌న్ షూటింగ్‌కు విజ‌య్ బ్రేక్ ఇచ్చిన‌ట్లు వార్త‌లొచ్చాయి. సంక్రాంతికి జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కావ‌డం అనుమాన‌మేనంటూ అభిమానులు ఫిక్సైపోయారు. ఈ పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెడుతూ మేక‌ర్స్ గురువారం రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌చేశారు. జ‌న‌వ‌రి 9న జ‌న‌నాయ‌గ‌న్ ప్రేక్ష‌కుల ముందుకురానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్‌తో పాటు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ పంచుకున్న‌ది. ఈ పోస్ట‌ర్‌లో ఓ జ‌న స‌మూహం మ‌ధ్య‌లో నిల్చొని మాస్ లుక్‌లో విజ‌య్ క‌నిపిస్తున్నారు.

- Advertisement -

జ‌న‌వ‌రి 9న జ‌న‌నాయ‌గ‌న్‌తో పాటు ప్ర‌భాస్ రాజాసాబ్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రెండు పాన్ ఇండియ‌న్ సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగు, త‌మిళంతో పాటు క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అవుతున్నాయి. జ‌న‌నాయ‌గ‌న్‌, రాజాసాబ్ మ‌ధ్య బాక్సాఫీస్ పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read – Anasuya: కోలీవుడ్‌లోకి అన‌సూయ ఎంట్రీ – ప్ర‌భుదేవాతో రొమాన్స్‌!

రాజాసాబ్ పోటీని త‌ట్టుకొని తెలుగులో ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ ఎంత వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డుగ‌లుగుతుంది? ఏ మేర‌కు థియేట‌ర్లు దొరుకుతాయ‌న్న‌ది అనుమాన‌మే. త‌మిళంలో ఈ సీన్ రివ‌ర్స్ అయ్యే అవ‌కాశం ఉంది. జ‌న‌నాయ‌గ‌న్ కార‌ణంగా ఫ‌స్ట్ వీకెండ్‌లో త‌మిళంలో రాజాసాబ్‌కు చాలా త‌క్కువ థియేట‌ర్లు దొర‌క‌వ‌చ్చున‌ని అంటున్నారు. జ‌న‌నాయ‌గ‌న్‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమా అంటున్నారు. దాంతో సంక్రాంతికి విడుద‌ల‌వుతోన్న సినిమాల్లో ఎక్కువ థియేట‌ర్ల‌ను జ‌న‌నాయ‌గ‌న్‌కే కేటాయించాల‌ని కోలీవుడ్ వ‌ర్గాలు నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే రాజాసాబ్‌కు ఇబ్బంది త‌ప్ప‌దు. . స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రూ విజేత‌గా నిలుస్తార‌న్న‌ది అభిమానుల్లో క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. జ‌న‌నాయ‌గ‌న్ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌మితా బైజు కీల‌క పాత్ర పోషిస్తుంది.

కాగా సంక్రాంతికి రాజాసాబ్‌, జ‌న‌నాయ‌గ‌న్‌తో పాటు చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక‌రాజుతో పాటు ర‌వితేజ – కిషోర్ తిరుమ‌ల సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. శివ‌కార్తికేయ‌న్ ప‌రాశ‌క్తి కూడా పండుగ‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. సంక్రాంతి పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

Also Read – Deepthi Sunaina: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న దీప్తి సునైనా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad