Sigma: హీరోల కొడుకులు హీరోలుగానే ఎంట్రీ ఇవ్వడం కామన్. ఇప్పుడున్న స్టార్ హీరోలు చాలా మంది వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవాళ్లే. మెళ్లమెళ్లగా ఈ ట్రెండ్ మారుతోంది. హీరోల కొడుకులు డైరెక్టర్లుగా మారుతోన్నారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ కొడుకు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించి ప్రేక్షకులను మెప్పించాడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు దర్శకత్వం వహిస్తున్న డెబ్యూ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ సోమవారం రిలీజయ్యాయి.
సందీప్ కిషన్ హీరోగా ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీకి సిగ్మా అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. డబ్బు, బంగారం గుట్టలుగా పోసి ఉన్న ఓ నిధిపై కూర్చొని మాస్ లుక్‌లో సందీప్‌కిషన్ కనిపిస్తున్నాడు. పోరాటానికి సిద్ధమైనట్లుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
సిగ్మా మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే సిగ్మా షూటింగ్ 95 శాతం వరకు పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్‌గా ఉందట. త్వరలోనే ఈ పాట చిత్రీకరణను పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామని మేకర్స్ చెబుతున్నారు. కేవలం అరవై రోజుల్లోనే జాసన్ సంజయ్ ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడట. అవుట్‌పుట్ విషయంలో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిగ్మా మూవీ తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది.
Also Read – Raviteja: మాస్‌జాతర ఫెయిల్యూర్‌కు రవితేజనే కారణమా? – సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
సిగ్మా మూవీ సక్సెస్ జాసన్ సంజయ్‌తో పాటు సందీప్‌కిషన్, లైకా సంస్థలకు కీలకంగా మారింది. డైరెక్టర్‌గా జాసన్ సంజయ్ మేకింగ్, టేకింగ్ ఎలా ఉంటాయన్నది కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. దళపతి విజయ్ కొడుకు అనే ఇమేజ్‌ను దాటి దర్శకుడిగా తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను మెప్పించడం అంటే పెద్ద సవాలే.
మరోవైపు సందీప్‌కిషన్ హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. సిగ్మా సక్సెస్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. సిగ్మా మూవీతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోన్నాడు. లైకా పరిస్థితి అలాగే ఉంది. ఇండియన్ 2, వెట్టయాన్‌తో పాటు స్టార్ హీరోలతో చేసిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లైకా నుంచి సినిమా వస్తుందంటే ఫ్లాపే అనే ముద్ర ఆడియెన్స్‌లో పడిపోయింది. ఈ విమర్శల నుంచి లైకా సంస్థను దళపతి విజయ్ కొడుకు ఎంత వరకు గట్టెక్కిస్తాడో చూడాల్సిందే.
కాగా సిగ్మా మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ సందీప్ కిషన్ కాదట. దుల్కర్ సల్మాన్‌తో ఈ సినిమా చేయాలని జాసన్ సంజయ్ అనుకున్నాడట. కానీ దుల్కర్ సల్మాన్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సందీప్‌కు ఈ అవకాశం దక్కింది.
Also Read – Ind vs SA: సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. వైజాగ్ లో కీలక మ్యాచ్..


