SS Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ హవా నడుస్తోంది. సినిమా ఏదైనా, స్టార్స్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పేరే వినిపిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అదరగొట్టాడు తమన్. ఓజీ విజయంలో తమన్ పాటలు, బీజీఎమ్ కీలకంగా నిలిచాయి. తన మ్యూజిక్‌తోనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు తమన్.
ఓజీ తర్వాత తమన్ కెరీర్‌లో మోస్ట్ అవైటింగ్ మూవీగా ప్రభాస్ రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పనిచేస్తున్న సినిమా ఇది. గతంలో రాధేశ్యామ్‌కు కేవలం బీజీఎమ్ మాత్రమే అందించాడు.
బెస్ట్ మూవీ….
ఓజీ ప్రమోషన్స్‌లో రాజాసాబ్ మూవీపై తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా రాజాసాబ్ నిలుస్తుందని తమన్ అన్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత లెక్కలన్నీ మారుతాయి. రాజాసాబ్‌లో కొత్త ప్రభాస్‌ను చూస్తారు. ఆయన స్క్రీన్‌ఫై కనిపించే ప్రతి సీన్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. మారుతి మామూలు సినిమా తీయలేదు. రిలీజ్ తర్వాత బిఫోర్ రాజాసాబ్ ఆఫ్టర్ రాజాసాబ్ అంటారు అని తమన్ అన్నాడు.
Also Read – India Vs Pak: హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. పాక్‌తో భారత్ అమీతుమీ!
రీ రికార్డింగ్…
ప్రస్తుతం రాజాసాబ్‌కు సంబంధించి రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ రికార్డింగ్‌లో కొన్ని క్రేజీ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశాం. థియేటర్‌లో ఆడియెన్స్‌ను అవన్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి అని తమన్ అన్నాడు. తమన్ కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది.
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు…
తన నెక్స్ట్ మూవీస్‌తో పాటు గుంటూరు కారం సినిమాపై వచ్చిన ట్రోల్స్‌పై ఓజీ ప్రమోషన్స్‌లో తమన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం రాజాసాబ్, అఖండ 2తో పాటు బాలకృష్ణ – గోపీచంద్ మలినేని, చిరంజీవి – బాబీ సినిమాలకు తానే మ్యూజిక్ అందిస్తున్నట్లు తమన్ చెప్పాడు.
మహేష్‌బాబు ఫ్యాన్స్…
గుంటూరు కారం విషయంలో మహేష్‌బాబు ఫ్యాన్స్ తనను అపార్థం చేసుకున్నారని అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని తమన్ తెలిపాడు. గుంటూరు కారం నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా తనను తీసేయమంటూ పెట్టిన ఓ ట్యాగ్‌పై 67 వేలకుపైగా ట్వీట్స్ వచ్చాయని, కానీ ఆ ట్రోల్స్ ఏవి పట్టించుకోకుండా త్రివిక్రమ్ నన్ను నమ్మారని, ఆయన వల్లే తనకు జాతీయ అవార్డు వచ్చిందని తమన్ పేర్కొన్నాడు.
కాగా రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read – Viral Video: పాము పిల్లలను పెట్టడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో..


