Saturday, February 1, 2025
Homeచిత్ర ప్రభThandel Pre Release Event: ‘తండేల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పోస్ట్ పోన్..

Thandel Pre Release Event: ‘తండేల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పోస్ట్ పోన్..

శనివారం సాయంత్రం జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్టు ‘తండేల్‌’ (Thandel) చిత్ర బృందం తెలిపింది. ఈ వేడుక (Thandel Pre Release Event)ను ఆదివారం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. ‘‘ది ఐకానిక్‌ తండేల్‌ జాతరను ఆదివారానికి వాయిదా వేస్తున్నాం అని పోస్ట్ పెట్టింది.

ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

- Advertisement -

అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న నేపథ్యంలో ‘పుష్ప2’ సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారని అభిమానులు అనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారానికి వాయిదా పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News