Eesha Rebba: టాలీవుడ్‌లో మరో కొత్త లవ్‌స్టోరీ మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో అచ్చ తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. అమీతుమీ, అ! రాగల ఇరవై నాలుగు గంటల్లో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్, యాక్టింగ్‌తో ఆకట్టుకుంటున్న అవకాశాలు రేసులో మాత్రం వెనుకబడిపోయింది.
ప్రస్తుతం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఈషారెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తెలుగు సినిమా షూటింగ్‌లోనే తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. ఆ మధ్య వీరిద్దరు కలిసి తిరుమల వెళ్లిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సమ్‌థింగ్ నడుస్తున్నట్లు వార్తలొచ్చాయి. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా జంటగా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. ఈ దీపావళి సెలబ్రేషన్స్‌లో తరుణ్, ఈషా చాలా క్లోజ్‌గా కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనంటూ నెటిజన్లు చెబుతున్నారు. ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read – Samantha: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ – ఫొటోలు వైరల్
మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ ప్రేమ పుకార్లను కొట్టిపడేస్తున్నారు. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహంతోనే దీపావళి వేడుకలకు జంటగా అటెండ్ అయ్యుంటారని అంటున్నారు. మరోవైపు తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా ఇద్దరి సొంత ఊరు వరంగల్ కావడం గమనార్హం. ఒకే ఊరు కావడంతో ఆ చనువుతోనే తరుణ్‌తో ఈషారెబ్బా క్లోజ్‌గా ఉంటున్నట్లు చెబుతున్నారు. తరుణ్ భాస్కర్‌కు పెళ్లయ్యింది. ఆయన భార్య లతానాయుడు పెళ్లిచూపులుతో పాటు మరికొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. మనస్పర్థల కారణంగా తరుణ్, లత విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మారాడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. డైలాగ్, స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఈ మూవీతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో డైరెక్టర్‌గా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాడు. యాక్టర్‌గా మీకు మాత్రమే చెప్తా, సీతారామం, దాస్ కా దమ్కీ తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఈ నగరానికి ఏమైంది 2 మూవీని తెరకెక్కిస్తున్నాడు తరుణ్ భాస్కర్.
Also Read – Gujarat CM :రోడ్డుపై సామాన్యుడిలా దీపావళి షాపింగ్ చేసిన సీఎం


