Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభSreeleela: 2025 సెకండాఫ్‌లో శ్రీలీల జోరు..

Sreeleela: 2025 సెకండాఫ్‌లో శ్రీలీల జోరు..

2025 Movies: కుర్ర భామ శ్రీలీల లక్ మామూలుగా లేదు. మనది సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీ. అందులోనూ మన మేకర్స్ హీరోయిన్స్ విషయంలో చాలా ఆలోచిస్తారు. మొదటి సినిమా హిట్ అయితే వరుసగా దర్శకనిర్మాతలు ఆ హీరోయిన్ మీద కర్చీఫ్స్ వేసేస్తారు. అదే ఫ్లాపైతే పనికట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోరు. కానీ, ఈ విషయంలో శ్రీలీల ఎంతో అదృష్టవంతురాలు. తెలుగులో మొదటి సినిమా పెళ్లి సందడి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, నాలుగైదు సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్సులు అందుకుంది.

- Advertisement -

రెండవ సినిమానే సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజతో చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. వీరి కాంబోలో వచ్చిన ధమాకా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి రవితేజ, శ్రీలీల కాంబోలో మాస్ జాతర అనే సినిమా వస్తోంది. ధమాకా సక్సెస్‌ని మళ్ళీ వీరు రిపీట్ చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్, టీజర్ ఆసక్తిని రేపాయి. ఈ ఏడాది ఆగస్టు 27న రిలీజ్ కాబోతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/genelia-sensational-comments-on-south-cinema-industry/

ఇక అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీ కూడా ఈ ఏడాదే వస్తుందని వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే, నవంబర్ 14న రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో శ్రీలీల లుక్స్ చాలా ట్రెడీషనల్‌గా ఉన్నాయి. ఇప్పటికే, లెనిన్ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే కొంత టాకీ పార్ట్ పూర్తైంది. త్వరలో ఉస్తాద్ సాంగ్స్ షూట్ కోసం ఫారిన్ వెళ్ళబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, శ్రీలీల పై సాంగ్స్ కంప్లీట్ చేయనున్నారు. ఇవి కాకుండా జూనియర్ అనే సినిమా, తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికీ 3 చిత్రాలు చేస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. శ్రీలీలలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ డాన్స్. ఆమె డాన్స్ కోసమే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ రకంగా చూసినా ఇప్పుడు శ్రీలీల నటిస్తున్న సినిమాలు 2025 సెకండాఫ్ లో రిలీజైతే ఆమెదే హవా మొత్తం అనుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News