Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభThe Girl Friend: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పరమ వేస్ట్! ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిర్మాత...

The Girl Friend: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పరమ వేస్ట్! ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

The Girl Friend: సినిమాని నిర్మించడంతో పాటుగా.. దాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం చాలా ముఖ్య‌మైన విష‌యం. అందుక‌నే ద‌ర్శ‌క నిర్మాత‌లు, చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో వెనుకంజ వేయ‌రు. ప్ర‌మోష‌న్స్ వైవిధ్యంగా ఉంటే ప్రేక్ష‌కులకు సినిమా క‌నెక్ట్ అవుతుంద‌ని వారి ఆలోచ‌న‌. దీంతో ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ కోసం నిర్మాత‌లు చాలానే ఖ‌ర్చు పెడుతుంటారు. దీనిపై యంగ్ ప్రొడ్యూస‌ర్ ధీర‌జ్ మొగిలినేని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -

ముఖ్యంగా ఆయ‌న‌ ప్రీ రిలీజ్ వేడుకలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తన దృష్టిలో పరమ వేస్ట్ స్ప‌ష్టం చేశారు. అదే సంద‌ర్బంలో కొన్ని సినిమాలకు మాత్రమే ఈ ప్రీరిలీజ్‌ వేడుక అవసరం కావొచ్చు కానీ, అన్ని సినిమాలకు అవసరం లేదని ఆయన వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయని, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తేనే మంచి బజ్ వస్తుందని భావించడం కేవలం ఒక పొరపాటని ధీరజ్ గుర్తుచేశారు.

Also Read – Adheera: ఈసారైనా సాక్షి వైద్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సినీ నిర్మాతలకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటంటే ఇతర హీరోలను గెస్టులుగా ఆహ్వానించడం. కార్యక్రమానికి ఒక స్టార్ హీరో గెస్ట్‌గా వస్తే మంచి బజ్ వస్తుందని భావించి, ఇండస్ట్రీలోని హీరోలందరికీ ఫోన్లు చేస్తుంటారని ధీరజ్ తెలిపారు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోతే, అది నిర్మాతలకు పెద్ద సమస్యగా మారుతుందని ఆయన వివరించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే… ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించకపోయినా నిర్మాతపై ఆరోపణలు వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఖర్చు పెట్టలేకే ఆ నిర్మాత ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారనే విమర్శలు కూడా వస్తాయని ధీరజ్ తెలిపారు.

ప్రమోషన్స్ పరంగా మేకర్స్ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి కొత్తగా ప్రయత్నించాలని ధీరజ్ మొగిలినేని సలహా ఇచ్చారు. కొత్తగా ప్రమోషన్లు ట్రై చేస్తేనే ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాపై మంచి బజ్ కూడా ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ధీరజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన నిర్మాణంలో రూపొందుతున్న తాజా చిత్రం ప్రమోషన్ల సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్మిక మందన్నప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి ధీరజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ రొమాంటిక్ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించారు. ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

Also read – Lava Agni 4: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..లావా అగ్ని 4 లాంచ్ డేట్ ఫిక్స్..కీలక ఫీచర్లు వెల్లడి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad