The Girlfriend: రష్మిక మందన్న టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ బ్లాక్‌బస్టర్స్‌తో అదరగొడుతోంది. పుష్ప 2, యానిమల్, ఛావా నుంచి ఇటీవల రిలీజైన థామా వరకు రష్మిక హీరోయిన్‌గా నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లే.
రష్మిక మందన్న లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జానర్‌ను టచ్ చేయబోతుంది. రష్మిక మందన్న కెరీర్‌లో ఇప్పటివరకు హీరో ఇమేజ్ ప్రధానంగా సాగే కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేసింది. ఈ సినిమాల విజయాల్లో రష్మిక పాత్ర నామమాత్రమే. స్టార్ హీరోల సినిమాల్లో షూటింగ్ చేయడం, ప్రమోషన్స్‌లో పాల్గొనడం వరకే హీరోయిన్లు పాత్ర పరిమితమవుతుంది. జయాపజయాల ప్రభావం కథానాయికలపై పెద్దగా ఉండదు.
కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో అలా కాదు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మొత్తం హీరోయిన్లపైనే ఉంటుంది. హీరోయిన్లకు ఉన్న పేరు ప్రఖ్యాతులు, స్టార్‌డమ్‌ను బట్టే బిజినెస్, కలెక్షన్స్, ఓటీటీ డీల్స్ ఆధారపడి ఉంటాయి. ఓపెనింగ్ రోజు నుంచి… ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు సినిమాను తమ భూజాలపై హీరోయిన్లు మోస్తూనే ఉండాలి. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌లో డబుల్ రిస్క్ ఉంటుంది. అందుకే లేడీ ఓరియెంటెడ్ అనగానే చాలా మంది హీరోయిన్లు వెనకడుగు వేస్తుంటారు.
Also Read – Gold Rate: కుప్పకూలిన గోల్డ్ రేట్లు.. తగ్గిన సిల్వర్, షాపర్స్ లేట్ చేయెుద్దిక..
అనుష్క మినహా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్లు ఎవరూ హిట్లు అందుకోలేకపోయారు. త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్ నుంచి అనుపమ పరమేశ్వరన్ వరకు చాలా మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో సినిమాలు చేసి చేదు ఫలితాలను అందుకున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్‌తో రష్మిక హిట్టు అందుకుంటుందా లేదా అన్నది టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. రష్మిక స్టార్‌డమ్‌కు ఈ మూవీ అసలైన పరీక్ష అని అభిమానులు చెబుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌లకు న్యాయం చేయగలిగే సత్తా రష్మికకు ఉందా లేదా అన్నది నవంబర్ 7న తేలనుంది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా ఫేమ్ దీక్షిత్‌శెట్టితో పాటు అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ విజయంపైనే రష్మిక మందన్న నెక్స్ట్ మూవీ మైసా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. మైసా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఇందులో యాక్షన్ రోల్‌లో రష్మిక కనిపించబోతున్నది.
Also Read – Nupur Sanon: పింక్ శారీలో పరువాల జాతర


