Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇది మామూలు రొమాంటిక్ సినిమా కాదు, లోతైన ఎమోషన్స్‌తో కూడిన ఒక నిజమైన ప్రేమకథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. పాటలు, పోస్టర్లు ఆల్రెడీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/khaidi-2-dilli-vs-rolex-lokesh-kanagaraj-lcu/
ట్రైలర్ మొదలయ్యేదే ఒక పవర్ ఫుల్ డైలాగ్‌తో: “మనం ఓ చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు, ఒక బ్రేక్ లాగా”. ఈ మాటలు వినగానే, ఈ ప్రేమకథలో ఏదో పెద్ద సమస్య ఉందనేది అర్థమవుతుంది. ఈ సినిమాలో భూమా అనే అమ్మాయి పాత్రలో రష్మిక కనిపిస్తుంది. ఈ అమ్మాయికి సెన్సిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విక్రమ్ అనే ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఉన్న అబ్బాయిగా దీక్షిత్ శెట్టి కనిపిస్తాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణాన్ని మొదట అందంగా చూపించినా, తర్వాత కథ మలుపు తిరుగుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన విక్రమ్, వేరే అమ్మాయికి దగ్గరైతే.. భూమా మనసులో ఎలాంటి సంఘర్షణ జరుగుతుంది? తన ప్రేమ కోసం ఆమె ఎంత కష్టపడుతుంది? అనేదే ఈ సినిమా కథ. ట్రయాంగిల్ లవ్ స్టోరీలోని నొప్పిని, బాధను ఈ సినిమా చూపించబోతోంది.
కొన్ని సీన్స్‌లో రష్మిక నటన చూస్తే ఆశ్చర్యపోతాం. బాయ్‌ఫ్రెండ్ మోసం చేసినప్పుడు ఆ అమ్మాయి పడే వేదనను, కోపాన్ని, ఏడుపును ఆమె కళ్లలో చాలా బాగా చూపించింది. రావు రమేష్ గారు ఆమె తండ్రిగా కీలక పాత్ర పోషించడం వలన, ఎమోషనల్ సీన్స్‌కు మరింత బలం వచ్చింది.
లవ్, ఎమోషన్, మంచి ఫీలింగ్స్, రొమాన్స్.. అన్నీ కలిపి ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కాబోతోంది. కొత్త తరహా ప్రేమకథలు, మంచి ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సినిమాను థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది.


