Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSamyuktha Menon: ఏడాది పాటు ఒక్కటీ లేదు.. కట్ చేస్తే చేతిలో 8 సినిమాలు.. ఆ...

Samyuktha Menon: ఏడాది పాటు ఒక్కటీ లేదు.. కట్ చేస్తే చేతిలో 8 సినిమాలు.. ఆ లక్కీ బ్యూటీ ఎవరో తెలుసా?

The Golden Leg Of Tollywood: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మొత్తం పాన్ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలే కాదు చిన్న హీరోలు సైతం పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు రెడీ అయిపోతున్నారు. దీంతో, పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని అన్న చందంగా స్టార్‌ స్టేటస్‌ ఉన్న సమయంలోనే రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే, ఈ అవకాశం అందరికీ రాదు. చాలా కొద్దిమందికి మాత్రమే వస్తుంది. సరిగ్గా, అలాంటి లక్కీ ఆఫర్లను పట్టేసింది ఓ ముద్ధుగుమ్మ. వరుసగా 8 చిత్రాల్లో ఆఫర్‌ కొట్టేసి ఫుల్‌ జోష్‌ మీదుంది. ఆ హీరోయిన్ ఎవరు? ఏ ఏ చిత్రాల్లో ఆఫర్‌ కొట్టేసింది? అనే విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

సార్‌ సినిమాతో సూపర్‌ క్రేజ్‌..
ఏకంగా ఎనిమిది చిత్రాల్లో ఆఫర్‌ కొట్టేసిన ఆ ముద్దుగుమ్మే సంయుక్త మీనన్‌. ప్రస్తుతం దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది ఈ ముద్ధుగుమ్మ. 2023లో విడుదలైన సార్‌ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నప్పటికీ.. టాలీవుడ్ మాత్రం తనను పట్టించుకోలేదు. దీంతో 2024 ఏడాదిలో తెలుగులో ఒక్క సినిమాలో కూడా ఆఫర్‌ దక్కలేదు. అలాంటి సంయుక్త మీనన్‌కు 2025 బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.
దీంతో ఈ అమ్మడుని గోల్డెన్‌ బ్యూటీగా పిలుస్తున్నారు.

ఫుల్‌జోష్‌ మీదున్న ముద్దుగుమ్మ..
2016లో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంయుక్త మీనన్‌.. పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. దీంతో ఈ అమ్మడిని గోల్డెన్ బ్యూటీ అన్నారు. కానీ వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. 2023లో ఆమె హీరోయిన్ గా చేసిన డెవిల్ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. దాదాపు ఏడాది పాటు ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తుంది. బాలకృష్ణతో అఖండ 2, పూరీ, విజయ్ సేతుపతి కాంబో, శర్వానంద్ జోడిగా నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ, నిఖిల్ జోడిగా స్వయంభు, లారెన్స్ బెంజ్, హిందీలో మహారాణి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో మరో క్రేజీ మూవీలో ఆఫర్‌ పట్టేసిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మొత్తానికి చేతినిండా ఎనిమిది చిత్రాలతో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంకెన్ని ఆఫర్లు పట్టేస్తుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad