Vijay Devarakonda: విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి విజయ్ దేవరకొండ ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. పెద్ద డైరెక్టర్స్, పెద్ద నిర్మాణ సంస్థలతో చేసినా ఫలితం దక్కలేదు. గత చిత్రం కింగ్డమ్ మీద కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ముందు ప్రేక్షకుల్లో అంచనాలన్నీ రిలీజయ్యాక తలకిందులయ్యాయి.
ఇక ఇంతకముందు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ నటించిన టాక్సీవాలా మంచి హిట్ సినిమాగా నిలిచింది. కెరీర్ ప్రారంభంలో చేసిన ఈ సినిమా వీరిద్దరికీ మంచి విజయాన్ని ఇచ్చింది. మరోసారి ఇదే కాంబోలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.
Also Read – Prabhas: ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాపై సూపర్ అప్‌డేట్ – షూటింగ్‌కు అంతా రెడీ!
అయితే, ఈ మూవీ కోసం రాహుల్ సాంకృత్యాన్ భారీ ప్లాన్ వేశారని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇందులో విజయ్ ను ఢీకొట్టే విలన్ పాత్ర ఉండగా, దీని కోసం ఏకంగా హాలీవుడ్ నటుడిని దింపుతున్నట్లు లేటెస్ట్ న్యూస్ ఒకటి మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అతనెవరో కాదు.. ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడైన ఆర్నాల్డ్ వోస్లూ. ఈ మూవీలో విలన్ గా ఆర్నాల్డ్ ని సెలెక్ట్ చేసినట్లు తాజా సమాచారం.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ ని కేటాయించి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు గానే, స్టార్ క్యాస్టింగ్ ని ఎంచుకుంటూ ఈ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇక విజయ్ కు దీటుగా ఆర్నాల్డ్ ను తీసుకోవడం సూపర్ సెలక్షన్ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే, లైగర్ లా కాకుండా మంచి కథతో వస్తే మాత్రం గ్యారెంటీగా ప్రేక్షకులు ఆదరిస్తారని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి రాహుల్ సాంకృత్యాన్ హిట్ ఇస్తాడా లేదా చూడాలి.


