Saturday, November 15, 2025
HomeTop StoriesThe Raja Saab: 'ది రాజాసాబ్' ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!

‘ది రాజాసాబ్’.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ ‘రాజాసాబ్’ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా భారీ స్థాయిలో హైప్‌ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ, ప్రభాస్ చేయని ఓ డిఫరెంట్ రోల్ ఇందులో చేస్తుండటంతో అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. గత చిత్రం ‘సలార్’ కంప్లీట్ యాక్షన్ మూవీగా వచ్చింది.

- Advertisement -

ఇప్పుడు రూపొందుతోన్న ‘ది రాజాసాబ్’ కామెడీ అండ్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌ని చూస్తే, సినిమాలో బాగా ఫన్ ఉండేట్లు కనిపిస్తోంది. ఇక, మారుతికి ఈ సినిమా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఇంతకముందు వెంకటేశ్, గోపీచంద్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసినప్పటికీ, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో హర్రర్ జానర్ సినిమాను తీసి ఎంతవరకూ మెప్పిస్తాడో..! అని అందరిలోనూ ఓ క్యూరియాసిటీ ఉంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-trailer-ss-rajamouli-4k-re-release/

ఒక్కో అప్‌డేట్‌తో ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న అభిమానులకి నిరాశ తప్పలేదు. అయితే, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ పై అప్‌డేట్ ఇచ్చారు. ఈ నవంబర్ 5వ తేదీన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు. ఇటీవలే మేకర్స్ యూరప్ వెళ్ళారు. అక్కడ రెండు పాటల చిత్రీకరణను జరిపారు.

ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటులు సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక, ప్రభాస్ ఈ సినిమాతో పాటు ఫౌజీలోనూ నటిస్తున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం త్వరలో సెట్స్ పైకి రాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad