Kanthara Chapter 1: కాంతార.. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండస్ట్రీలలోనే ఓ సంచలనం సృష్ఠించిన సినిమా. ఆచారాలు, వారసత్వం, తరాల నుంచి వస్తున్న ఆనవాయితీల ఆధారంగా మైథలాజికల్ టచ్ తో తయారు చేసిన కథతో రిషబ్ శెట్టి అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గానీ, విడుదలకి ముందు గానీ అంతగా బజ్ లేదు. కానీ, థియేట్రికల్ రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ ని సాధించింది. కన్నడలో ఊహించని వసూళ్ళను రాబట్టింది.
ఇక, తెలుగులో ఈ సినిమా ఓటీటీ అండ్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేసి భారీ లాభాలను సొంతం చేసుకున్నారు. ఎప్పుడైతే కాంతార చిత్రం ఇంత పెద్ద విజయం సాధించిందో, అప్పుడే ఈ సినిమా ప్రీక్వెల్ కథను తయారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ భారీ అంచనాలను పెంచాయి. కేవలం 14 కోట్ల రూపాయలతో నిర్మించిన కాంతార దాదాపు 450 కోట్ల వరకూ వసూలు చేసింది.
Also Read – TG CPGET 2025: టీజీ సీపీగెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే ప్రక్రియ ప్రారంభం
దాంతో ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న కాంతార ప్రీక్వెల్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రకటన ఇదివరకే వచ్చింది. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో కాంతార చాప్టర్ 1 సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్టుగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి అధికారికంగా అన్నీ భాషలలోనూ కాంతార చాప్టర్ 1 ముందు ప్రకటించిన అక్టోబర్ 2నే వస్తుందని ఎక్స్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఇదేరోజున ఓ సర్‌ప్రైజ్ కూడా ఉంది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ది రాజాసాబ్. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు పెద్దగా అంచనాలు లేకపోయినా, ఆ తర్వాత వచ్చిన అప్‌డేట్స్‌తో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, మళ్ళీ సంక్రాంతికి కి షిఫ్ట్ అవుతున్నట్టుగానూ నిర్మాత వెల్లడించారు. అయితే, ఇంకా అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. ఇక కాంతారా చాప్టర్ 1 రిలీజ్ రోజు నుంచి ది రాజాసాబ్ థియేట్రికల్ ట్రైలర్ ని వదలాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదే జరిగితే ది రాజాసాబ్ సినిమాకి భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. కాగా, ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read – Health Tips: PCOS సమస్యలకు చనా ట్రెండ్: నిజంగానే సహాయపడుతుందా?


